తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బుధవారం తెల్లవారుజామున కరూర్ జిల్లా కుళితలైలో కరూర్-తిరుచ్చి జాతీయ రహదారిపై బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా కాలిపోయింది. కారులోని ఐదుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న ముసిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది దాదాపు గంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. మంటలను ఆర్పిన అనంతరం మృతదేహాలను కారులో…
MK Stalin: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేయడం వల్ల లోక్సభ సీట్లు తగ్గే అవకాశం ఉందని అన్నారు. గతంలో కూడా స్టాలిన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. గతంలో స్టాలిన్ మాట్లాడుతూ.. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రజలు ‘‘16 మంది పిల్లలను’’ పెంచడం గురించి ఆలోచించేలా చేస్తోందని, 16 రకాల సంపదలపై తమిళ సామెతను ఉదహరిస్తూ అన్నారు.
Hindi Row: జాతీయ విద్యా విధానం (NEP)లో భాగంగా త్రిభాషా సూత్రాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళనాడులోని ఎంకే స్టాలిన్ సర్కార్, అధికార డీఎంకే పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే, దీనిపై కేంద్రం విద్య మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం సీఎం స్టాలిన్కి లేఖ రాశారు. ‘‘ ఏ భాషను బలవంతంగా రుద్దే ప్రశ్నే లేదు,
Udayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్ కి వచ్చే 2190 కోట్ల రూపాయల నిధులు తామేమీ అడుక్కోవడం లేదని పేర్కొన్నారు. మీ అయ్యా సొమ్ము ఏం అడగడం లేదని విమర్శలు గుప్పించారు.
జయలలిత ఆస్తులు చెన్నై చేరుకున్నాయి. మాజీ సీఎం జయలలిత ఆస్తులను స్పెషల్ సీబీఐ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది. నిన్నటి 12 అట్టపెట్టెల్లో భారీ భద్రత నడుమ బెంగుళూరు నుంచి చెన్నై తరలించారు. మొత్తం నాలుగు వేల కోట్లు విలువ చేసే 27 కిలోల ఆభరణాలు.. 601 కిలోల వెండి ఉన్నట్లు అధికారులు తెలిపారు. పది వేలకుపైగా చీరలు, 750 జతల చెప్పుల జతల చెప్పులు ఉన్నాయి.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పళని నుంచి తిరుమలకు వచ్చే భక్తులకు రవాణా సౌకర్యంపై దృష్టి పెడతామన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకి తెలియ చేస్తా.. క్యాబినెట్ దృష్టికి తీసుకు వెళ్తానని పేర్కొన్నారు.
Annamalai: కేంద్ర బడ్జెట్పై నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ చేసిన విమర్శలకు, తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక విధానాలు ఎలా రూపొందించబడతాయనే ప్రాథమిక అవగాహన ఆయనకు లేదని ఆరోపించారు. విజయ్ బడ్జెట్ని ఉద్దేశించి విమర్శి్స్తూ.. తమిళనాడుని బడ్జెట్లో పట్టించుకోలేదని, జీఎస్టీ తగ్గింపు గురించి ఎలాంటి ప్రస్తావన లేదని ఆరోపించారు.
Tamil Nadu: పెరియార్ సిద్ధాంతం, కుల-మత రహిత సమాజం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పే తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల కుల దురహంకారం, పరువు హత్యలు జరుగుతున్నాయి. తాజాగా, రాష్ట్రంలోని శివగంగై జిల్లాలోని మెలపిడావూర్ సమీపంలో దళిత విద్యార్థిపై అగ్రకులానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి, అతడి చేతులు నరికేశారు. ప్రభుత్వ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న బాధితుడు అయ్యసామి(20) బుధవారం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై ఇంటికి వెళ్తుండగా దాడికి గురయ్యాడు. Read Also: Titanic Submersible: సముద్రగర్భంలో…
ఈ నెల 12వ తేదీ నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన ప్రారంభంకానుంది.. ఈ పర్యటనలో మూడు రోజులు వివిధ దేవాలయాలను సందర్శించనున్నారు పవన్ కల్యాణ్.. ఈ నెల 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పవన్ ఆలయాల సందర్శన కొనసాగనుంది.. ఈ ఆధ్యాత్మిక యాత్రలో.. అనంతపద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసరామస్వామి, అగస్థ్య జీవసమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను పవన్ కల్యాణ్…
Tamilnadu : తమిళనాడులోని మధురైలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. నగరంలో 14,000 మందికి పైగా ప్రజలు వీధికుక్కల బారిన పడ్డారు. అయితే, ఈ సమస్య ఒక్క మధురైకే పరిమితం కాలేదు.