డ్రైవర్ల నిర్లక్ష్యం, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడంతో రోడ్డు ప్రమాదాలకు ఆజ్యం పోసినట్లవుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాల్లో అమాయకపు ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంగవైకల్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ట్రాఫిక్ అధికారులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి చెందగా మరికొందరు గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం తమిళనాడులో చోటుచేసుకుంది.
Also Read:Chennai: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొన్న లారీ.. ఐదుగురు మృతి
తిరువళ్లూరు జిల్లాలోని తిరుత్తణి సమీపంలోని కేజీ కందిగై వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. 29 మందికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. గాయపడి వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు.
Also Read:Hyderabad: స్థలం కబ్జాకు స్కెచ్.. ల్యాండ్ గ్రాబర్స్ ముఠా అరెస్ట్
క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో బీరకుప్పం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురికావడంతో ఆప్రాంతం ఉలిక్కిపడింది. కాగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
#WATCH | Tamil Nadu | Visuals from the KG Kandigai area where 5 people lost their lives in a Tipper Lorry, and Bus collision near Thiruttani. As per Tiruttani Police, 10 others are in critical condition and admitted to Thiruttani General Hospital pic.twitter.com/cfLFlDwItJ
— ANI (@ANI) March 7, 2025