Tamil Nadu Governor: Tamil Nadu Governor:మూడేళ్లకు పైగా 10 బిల్లును ఆమోదించకుండా ఉన్న తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆమోదం లేకుండానే, దేశ చరిత్రలో తొలిసారిగా బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిలా ఉంటే, మరోసారి గవర్నర్ రవి వివాదంలో ఇరుక్కున్నారు. విద్యార్థులను ‘‘జైశ్రీరాం’’ నినాదం చేయాలని కోరడం ఇప్పుడు తమిళనాడులో వివాదంగా మారింది.
Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే అక్కడి స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వానికి గవర్నర్‌కి మధ్య విభేదాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఆయన చేసిన ‘‘లౌకికవాదం(సెక్యులరిజం)’’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి కారణమైంది.
లౌకికవాదం పేరుతో భారతదేశ ప్రజలకు "మోసం" జరిగిందని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆరోపించారు. సెక్యులరిజం యూరోపియన్ భావన.. అది భారతదేశంలో అవసరం లేదని తమిళనాడు గవర్నర్ పేర్కొన్నారు. ఆదివారం కన్యాకుమారిలో జరిగిన ఓ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగిస్తూ.. ‘‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి,
Supreme Court: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత కే పొన్ముడిని మంత్రివర్గంలో చేర్చుకునేందుకు గవర్నర్ నిరాకరించడంపై ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానిస్తూ.. ‘గవర్నర్ సుప్రీంకోర్టును ధిక్కరిస్తున్నారు’’అని అన్నారు. గవర్నర్ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే, ప్రభుత్వం ఏం చేస్తుంది..? అని కేంద్రాన్ని సుప్రీం ప్రశ్నించింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్‌కి…
ఈ మధ్య కాలంలో గవర్నర్లకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి
తమిళనాడులో రాజ్ భవన్‌లో అర్ధరాత్రి వరకు పొలిటికల్ హైడ్రామా సాగింది. మంత్రి పదవి నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తున్నట్టు గవర్నర్ ఆర్ఎన్ రవి జారీ చేసిన ఉత్తర్వులను ఆయన వెనక్కి తీసుకున్నారు. ప్రస్తుతానికి ఆ నిర్ణయాన్ని నిలిపి ఉంచారని తెలుస్తోంది.
DMK Worker's Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం…
Governor vs CM in Tamil Nadu: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ప్రభుత్వాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగంపై డీఎంకే పార్టీ మండిపడుతోంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ అసెంబ్లీలోనే తీర్మానం పెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని అసెంబ్లీ తీర్మానించింది. ఈ చర్యతో అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. దీని తర్వాత ‘గెట్ అవుట్ రవి’ యాష్ ట్యాగుని డీఎంకే పార్టీ ట్విట్టర్…
తమిళనాడు గవర్నర్, ఆ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం ముదిరింది. అసెంబ్లీ నుంచి గవర్నర్ రవి వాకౌట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని మాత్రమే స్పీకర్ రికార్డ్ చేయాలని, గవర్నర్ జోడించిన లేదా దాటవేయబడిన భాగాలను తొలగించాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఈరోజు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.