Tamil Nadu Governor: ఈ మధ్య కాలంలో గవర్నర్లకు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అయితే ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అటువంటి పరిస్థితే ఇపుడు తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతోంది. మొన్నటికి మొన్న నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి .. ఆ తీర్మానం కాపీని కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం కోరగా.. అందుకు రాష్ట్ర గవర్నర్ ఆర్‌ఎన్ రవి తిరస్కరించారు. నీట్ ఉండాల్సిందనేనని.. రాష్ట్రం అందులో నుంచి తప్పుకుంటే రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరుగుతుందని.. కాబట్టి తాను అందుకు ఒప్పుకోనని అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గవర్నర్ కేంద్రానికి పంపించలేదు. ఇప్పుడు తమిళనాడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎన్‌పీఎస్‌సీ) ఛైర్మన్ మరియు సభ్యుల నియామకంకు సంబంధించిన ఫైల్‌ను ఆమోదించకుండా పక్కన బెట్టారు. టీఎన్‌పీఎస్‌సీ ఛైర్మన్ మరియు సభ్యుల ఫైల్‌ను ఆమోదించకుండా.. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటూ గవర్నర్ కార్యాలయం ప్రభుత్వానికి లేఖ రాసింది.
Read Also: Bigg Boss Telugu Season 7 : సడెన్ గా బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ క్రేజీ హీరోయిన్…?
తమిళనాడు గవర్నర్ చర్యపై స్టాలిన్ సర్కార్ మండిపడుతోంది. టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్ నియామకంపై ప్రభుత్వం పంపిన ఫైల్‌ను గవర్నర్ వెనక్కిపంపారు. అంతేకాకుండా.. తమిళనాడు కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ‘మోడల్ సిలబస్’ను యూనివర్సిటీలు పాటించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ గవర్నర్ ఉత్తర్వులు జారీచేశారు. ‘మోడల్ సిలబస్’ను ఫాలో కావాల్సిన అవసరం లేదని తెలుపుతూ యూనివర్సిటీ వీసీలకు గవర్నర్ లేఖలు పంపారు. యూనివర్సిటీలకు గవర్నర్ ఛాన్స్ లర్‌గా వ్యవహారిస్తారన్న విషయం తెలిసిందే. యూజీసీ ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల సిలబస్ ఎలా తయారుచేస్తుందని గవర్నర్ ప్రశ్నించారు. టీఎన్‌పీఎస్‌సీ చైర్మన్‌గా మాజీ డీజీపీ సీ సైలేంద్రబాబును నియమిస్తూ, కమిషన్ సభ్యులుగా మరో 14 మంది పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి సంబంధిత ఫైల్‌ను పంపించింది. అయితే కమిషన్ చైర్మన్ మరియు సభ్యులకు సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటూ ఫైల్‌ను వెనక్కి పంపారని గవర్నర్ అధికారిక వర్గాలు తెలిపాయి. గవర్నర్ వ్యవహారించిన తీరును డీఎంకే వర్గాలు తీవ్రంగా ఖండించాయి. నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తుల్ని కమిషన్‌కు ఎంపికచేసినా.. ఆ ఫైల్‌ను ఎందుకు ఆమోదించలేదని డీఎంకే నాయకుడు ఆర్‌ఎస్ భారతీ ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాలకు ఇలా ప్రతీసారి అడ్డుతగలడం గవర్నర్‌కు సరైంది కాదని అంటున్నారు.