DMK Worker’s Threat To Tamil Nadu Governor: తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, డీఎంకే ప్రభుత్వం మధ్య వివాదం అలాగే కొనసాగుతోంది. డీఎంకే నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు. ఇప్పటికే ‘గెట్ అవుట్ రవి’ అంటూ చెన్నైతో పాటు పలు ప్రాంతాల్లో పోస్టర్లను ఏర్పాటు చేశారు డీఎంకే పార్టీ నేతలు. ఇదిలా ఉంటే తాజాగా మరో డీఎంకే నేత బహిరంగంగానే గవర్నర్ రవిని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని అధికార డీఎంకే పార్టీ వెల్లడించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని పార్టీ తెలిపింది.
Read Also: Harish Rao: బీజేపీని నమ్మి పార్టీలో చేరితే ఆత్మహత్య చేసుకున్నట్లే..
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రభుత్వం ఇచ్చిన స్పీచులో కొన్ని పదాలను మిస్ చేయడంతో వివాదం రాజుకుంది. బీఆర్ అంబేద్కర్, పెరియార్ వంటి ప్రముఖుల పేర్లను ఉచ్ఛరించకపోవడంపై డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తి తీవ్రస్థాయిలో బెదిరించారు. గవర్నర్ రవి అంబేద్కర్ పేరు చెప్పకపోతే కాశ్మీర్ వెళ్లాలని, ఆయనను అక్కడ ఉగ్రవాదులు కాల్చిచంపాలి అని అన్నారు. మేమే ఉగ్రవానది పంపిస్తాం, అతడిని కాల్చివేయనివ్వండం అంటూ ఓ సభలో బెదిరించారు. అంబేద్కర్ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిన పితామహుడు అని, ఆయన పేరును చెప్పడానికి నిరాకరిస్తే చెప్పుతో కొట్టే హక్కు నాకు ఉందా..? లేదా..? అని ప్రశ్నించారు.
డీఎంకే నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎంకేకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా..? అని బీజేపీ ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి స్టాలిన్ తీరుపై ప్రముఖ నటి, బీజేపీ నతే ఖుష్బు సుందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సీఎం హయాంలో కొత్త కల్చర్ అని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి జీవించే అర్హత లేదని ట్వీట్ చేశారు. డీఎంకే ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అన్నారు. ప్రధానిమోదీతో పాటు రాజ్యాంగపదవుల్లో ఉన్న నాయకులను ఎప్పుడూ తిడుతున్నారని.. తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాసినట్లు వెల్లడించారు. పోలీసుల చేతులు కట్టివేయబడ్డాయని.. స్థానిక డీఎంకే నాయకులు పోలీస్ స్టేషన్ ను సొంత కార్యాలయాలుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.