Pakistan: పాకిస్తాన్ ప్రభుత్వానికి పాక్ తాలిబాన్లు సవాల్ విసరుతూనే ఉన్నారు. బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో సైన్యం, పోలీసులు టార్గెట్ గా దాడులు చేస్తున్నారు.
Afghanistan Women: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. వారి హక్కులు హరించబడ్డాయి.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు దాడితో దద్దరిల్లింది. ఈ వారం ప్రారంభంలో హత్యకు గురైన ఆఫ్ఘన్ మంత్రి అంత్యక్రియల్లో ఆత్మాహుతి దాడి జరిగింది. బదక్షన్ ప్రావిన్స్ రాజధాని ఫైజాబాద్‌లో గురువారం ఈ ఘటన జరిగింది. ఈ బాంబుదాడిలో 11 మంది మరణించగా.. 30 మంది గాయపడినట్లు అంతర్గత మంత్రిత్వశాఖ తెలిపింది. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఈ దాడిని ఖండించింది.
అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. గతంలో బాలికల చదువులపై నిషేధం విధించారు. మహిళలు జిమ్‌లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాలను సందర్శించడంపై కూడా నిషేధం విధించారు.
Pakistan: పాకిస్తాన్ లో టాప్ ఇంటెలిజెన్స్ అధికారిని చంపారు ఉగ్రవాదులు. వాయువ్య పాకిస్తాన్ లో మంగళవారం ఉగ్రవాదులు, అధికారులకు మధ్య భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇంటెలిజెన్స్ అధికారి హతమవ్వగా.. ఆయన బృందంలోని ఏడుగురికి గాయాలు అయ్యాయని పాక్ ఆర్మీ వెల్లడించింది. గతేడాది నుంచి పాక్ పరిస్థితులు దిగజారడంతో వాయువ్య ప్రాంతం అయిన ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ తాలిబాన్లు రెచ్చిపోతున్నారు. ఈ ప్రాంతాన్ని పాక్ నుంచి విముక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
Peshawar Mosque Blast: పాకిస్తాన్ పెషావర్ నగరంలో సోమవారం మసీదులో బాంబు పేలుడు కారణంగా 101 మంది మరణించారు. అత్యంత కట్టుదిట్టమైన ప్రాంతంలో బాంబు పేలుడు చోటు చేసుకోవడం పాకిస్తాన్ నిఘా వ్యవస్థను ప్రశ్నిస్తోంది. అయితే ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల అలసత్వం, భద్రతాలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
తీవ్రమైన శీతల వాతావరణం, కార్బన్ మోనాక్సైడ్ విషప్రయోగం కారణంగా గత రెండు వారాల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో 100 మందికి పైగా మరణించారని ఆదివారం తాలిబాన్ నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.