Afghanistan Women: దెబ్బతిన్న హస్తకళల మార్కెట్.. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Afghanistan Women: ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుండి, అక్కడ పరిస్థితి నరకం కంటే దారుణంగా మారింది. ముఖ్యంగా మహిళల పరిస్థితి మరింత దిగజారింది. వారి హక్కులు హరించబడ్డాయి. వారిపై రకరకాల ఆంక్షలు విధించారు. చదువుపై నిషేధం, దుస్తులపై నిషేధం ఇలా వారిని చీడపురుగుల కంటే హీనంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ హస్తకళల మార్కెట్ భారీగా తగ్గుతోందని ఆఫ్ఘన్ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత రెండేళ్లుగా హస్తకళల మార్కెట్‌లో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని చాలా మంది మహిళలు చెబుతున్నారు. ఈ మహిళలు మార్కెట్‌ను పెంచడానికి సంబంధిత సంస్థల నుండి మద్దతు కోరారు. ఆఫ్ఘన్‌కు చెందిన మహిళా పెట్టుబడిదారు రోఖ్‌సర్ తాలిబాన్‌ల సహాయం కోరింది. రోఖ్‌సర్‌కు హస్తకళలో నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉంది.
మహిళలకు మద్దతు ఇవ్వాలి- రోఖ్‌సర్
రోఖ్‌సర్ మాట్లాడుతూ మహిళలు తమ కాళ్లపై తాము నిలబడి మరింత అభివృద్ధి చెందేలా వారికి అండగా ఉండాలని అన్నారు. ఆగస్ట్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ ఆక్రమించినప్పటి నుండి, వారి వ్యాపారం క్షీణించిందని వ్యాపారవేత్త బెనాఫ్షా చెప్పారు. ప్రజల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో అమ్మకాలు తగ్గాయని బెనాఫ్‌షా తెలిపింది. వారు మహిళల ఉత్పత్తులను కొనుగోలు చేయటం లేదు. అలాగే ఎయిర్ కారిడార్లను మూసివేయడం వల్ల వారి ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి కావడం లేదు.
Also Read
- Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
- AI Dance Video: "ప్రాంప్ట్ ఇదిగో".. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
Read Also:School Bus: నేలకొండపల్లిలో స్కూల్ బస్సు దగ్ధం
హామీ ఇచ్చిన తాలిబన్లు
తాలిబాన్ నేతృత్వంలోని పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి అఖుంద్జాదా అబ్దుల్ సలామ్ జవాద్ మాట్లాడుతూ.. వ్యాపార మహిళలకు సహాయం చేయడానికి తాలిబాన్ కట్టుబడి ఉందని అన్నారు. మహిళల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాం. హస్తకళల వ్యాపారంలో నిమగ్నమైన మహిళలకు పూర్తిగా మద్దతు ఇస్తున్నామని జవాద్ చెప్పారు.
మహిళల కోసం హస్తకళల మార్కెట్
మహిళల హస్తకళల కోసం దేశం లోపల, వెలుపల మార్కెట్‌లను సృష్టిస్తున్నాం, తద్వారా వారు దేశ వాణిజ్య రంగంలో శక్తివంతమైన భాగంగా గణనీయమైన సహకారం అందించగలరు. ఆఫ్ఘనిస్తాన్‌లోని నంగర్‌హార్, లఘ్‌మన్, కునార్, నూరిస్తాన్, హెరాత్, కాబూల్‌తో సహా 16 ప్రావిన్సులలో మహిళా వాణిజ్య సంస్థలు తెరిచి ఉన్నాయని ఉమెన్స్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది.
Read Also:Balayya : బాలయ్య కెరీర్ ను మలుపు తిప్పిన ఆ సినిమా..?
తాజావార్తలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
-
Stock Market Today: స్టాక్ మార్కెట్‌లో మళ్లీ నష్టాలు.. 1000 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్, 22,500 దిగువకు నిఫ్టీ!
-
Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
-
Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!