అఫ్గానిస్థాన్ (Afghanistan)లో తాలిబన్ల అరాచకం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఓ హత్య కేసులో దోషులుగా తేలిన ఇద్దరు వ్యక్తులకు బహిరంగంగా శిక్ష అమలుచేశారు.
Taliban: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేశంలో కఠిన ఆంక్షలు, చట్టాలు అమలవుతున్నాయి. ఇప్పటికే స్త్రీ విద్యను నిషేధించడంతో పాటు స్త్రీలు ఉద్యోగం చేయడాన్ని తాలిబాన్లు వ్యతిరేకిస్తున్నారు. మహిళల్ని వంటిళ్లకే పరిమితం చేశారు. చివరకు యూఎన్ కార్యక్రమాల్లో పనిచేసేందుకు కూడా వారిని అనుమతించడం లేదు. షరియా చట్టంతో ప్రజలపై తీవ్ర ఆంక్షల్ని విధిస్తున్నారు.
Afganistan : ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పేలుళ్లతో దద్దరిల్లింది. కాబూల్‌లోని పశ్చిమ ప్రాంతంలోని దష్ట్-ఎ-బర్చి ప్రాంతంలో బస్సులో భారీ పేలుడు సంభవించింది.
Pakistan: దాయాది దేశం పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారని తెలుస్తోంది. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు.
Taliban : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన రాగానే అక్కడ బాలికల విద్యను నిషేధించారు. ప్రజలు తాలిబాన్‌లకు దూరంగా ఉండటానికి ప్రధాన కారణం మహిళల విద్యపై నిరంతర నిషేధమని డిప్యూటీ విదేశాంగ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ అన్నారు.
Afghanistan: తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి ఉగ్రదాడి జరిగింది. పశ్చిమ ఆఫ్ఘాన్‌లోని హెరాత్ నగరంలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. షియా మతగురువులే టార్గెట్‌గా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. నగరంలోని కోరా మిల్లీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఏడుగురు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.
Taliban: ముంబై, హైదరాబాద్‌లలో ఆఫ్ఘన్ కాన్సులేట్లను తిరిగి తెరిచామని, తాలిబాన్ విదేశాంగశాఖ డిప్యూటీ పొలిటికల్ మంత్రి షేర్ మహ్మద్ అబ్బాస్ స్టానిక్‌జాయ్ తెలిపారు. ఈ రెండు ప్రాంతాల్లో ఆఫ్ఘన్ కాన్సులేట్లు పనిచేస్తున్నాయని, నేను వారితో మాట్లాడుతున్నానని, వారు రాయబార కార్యాలయాన్ని తిరిగి తెరిచారని ఆయన చెప్పారు. తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న జాతీయ టెలివిజన్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాలు కార్యకలాపాలు నిలిపేయడం వాస్తవం కాదని ఆఫ్ఘన్ ఛానెల్…
Pakistan: పాకిస్తాన్‌కి ఆఫ్ఘానిస్తాన్ పక్కలో బల్లెంలా తయారైంది. ముఖ్యంగా తాలిబాన్‌లు నేరుగా పాక్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. 2021 ఆగస్టులో ఆఫ్ఘానిస్తాన్ లోని ప్రజాప్రభుత్వాన్ని కూల్చి తాలిబాన్ పాలన వచ్చేందుకు పాకిస్తాన్ సహకరించింది. ఆ సమయంలో భారత్-ఆఫ్ఘన్ బంధాన్ని దెబ్బతీశామని పాకిస్తాన్ చాలా ఆనందపడింది. ఇక తాలిబాన్ నాయకులు తాము చెప్పినట్లు వింటారని అనుకుంది.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశ రాజధాని కాబూల్ నగరంలో బస్సులో పేలుడు సంభవించింది. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 2 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఆఫ్ఘాన్‌లో మైనారిటీ షియా హాజరా కమ్యూనిటీలు ఎక్కువగా ఉండే దష్ట్-ఎ-బర్చి పరిసరాల్లో పేలుడు సంభవించినట్లు పోలీస్ అధికారి ఖలీద్ జద్రాన్ తెలిపారు.
Pakistan: పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్‌లోని మియాన్వాలి వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు భారీ దాడికి తెగబడ్డారు. తెల్లవారుజామున 9 మంది సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. సైన్యానికి, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది టెర్రరిస్టులు హతమయ్యారు. పాకిస్తాన్ వ్యాప్తంగా అంతకుముందు రోజు జరిగిన టెర్రర్ అటాక్స్‌లో 17 మంది మరణించిన, తర్వాత రోజే ఈ దాడి జరిగింది.