Swine Flu Cases: తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగరవాసులనే కాదు గ్రామాలు సైతం విష జ్వరాలతో అల్లాడుతున్నాయి.
అసోంలో స్వైన్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ హెచ్1ఎన్1 వైరస్ సోకి 4 నెలల చిన్నారి మృతి చెందింది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా రెండో మరణం సంభవించింది.
Ashok Gehlot: రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్ కోవిడ్-19, స్వైన్ ఫ్లూ బారిన పడ్డారు. జ్వరం, తక్కువ ఆక్సిజన్ సాచురేషన్ స్థాయిలు ఉండటంతో జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అచల్ శర్మ శనివారం చెప్పారు.
కేరళలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపాలని ఆదేశించారు.
వర్షాకాలంలో అనేక ప్రాణాంతక వైరస్‌లు మనల్ని అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. H1N1 వైరస్ కారణంగా వచ్చే స్వైన్ ఫ్లూ వంటి వాటికి నివారణ లేనప్పటికీ, మిమ్మల్ని మీరు దాని బారిన పడకుండా కాపాడుకోవటం చాలా ముఖ్యం. H1N1 వైరస్ యొక్క లక్షణాలు, కారణాలు , చికిత్సలపై అవగాహన పెంచుకోవడమే కాదు.. ఈ వ్యాధి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఛాన్స్ ఉంది.
మిజోరాం రాష్ట్రంలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికన్ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపుగా 4800 పందులు మృత్యవాత పట్టాయి. మార్చి 21 వ తేదీన లంగ్‌లై జిల్లాలోని లంగ్‌సేన్ అనే గ్రామంలో మొదటగా ఈ వ్యాధి బయటపడింది. ఆ తరువాత ఈ వ్యాధి 9 జిల్లాలకు పాకింది. ఆ 9 జిల్లాల పరిధితో దాదాపుగా 91 గ్రామాలు ఉండగా, ఒక్క అయ్‌జోల్ జిల్లాలోనే 55 గ్రామాలు ఉండటం ఆంధోళన కలిగిస్తోంది. ఈ ఆఫ్రికన్…