H1N1 Flu: ఆ వైరస్ కారణంగా 4 నెలల శిశువు మృతి.. మూడు రోజుల్లో రెండవ మరణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
H1N1 Flu: అసోంలో స్వైన్ ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇక్కడ హెచ్1ఎన్1 వైరస్ సోకి 4 నెలల చిన్నారి మృతి చెందింది. గత మూడు రోజుల్లో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కారణంగా రెండో మరణం సంభవించింది. చిన్నారి సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ (SMCH)లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక, ఆరోగ్య అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మరణించిన చిన్నారిని అర్మాన్ హుస్సేన్ లస్కర్ గా గుర్తించారు. క్యాచర్ జిల్లాలోని ఉత్తర కృష్ణాపూర్ ప్రాంతంలో శిశువు కుటుంబం జీవనం కొనసాగిస్తుంది. ఇన్‌ఫ్లుఎంజా కారణంగా ఏప్రిల్ 12వ తేదీన సిల్చార్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో చేర్చించారు. చిన్నారిని ప్రాణాపాయ స్థితిలోకి ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా హెచ్1ఎన్1 వైరస్ ఉన్నట్లు గుర్తించామని ఎస్‌ఎంసిహెచ్ సీనియర్ వైద్యుడు తెలిపారు.
Read Also: Manushi Chhillar: సరికొత్త పోజులతో పరువాలు ఒలకబోస్తున్న మానుషి చిల్లర్…
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
ఇక, ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ.. చికిత్స ప్రారంభంలో, శిశువు బాగా స్పందించింది.. కానీ ఏప్రిల్ చివరి వారంలో అతని ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని పేర్కొన్నారు. RT-PCR పరీక్షను నిర్వహించి చిన్నారికి హెచ్1ఎన్1 వైరస్ సోకింది అనే విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. కాగా, ఎస్‌ఎంసీహెచ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్ గుప్తా మాట్లాడుతూ.. చిన్నారికి హెచ్1ఎన్1 సోకినా.. ఇతర వ్యాధులతో మృతి చెందాడు అని చెప్పారు. H1N1 వైరస్ అతని శరీరాన్ని మరింత బలహీనపరిచింది.. ఇదే ఆ చిన్నారి మరణానికి దారితీసిందన్నారు.
Read Also: Komatireddy: కేసీఆర్ గురించి మాట్లాడటమే వేస్ట్.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
అయితే, H1N1 వైరస్‌ని స్వైన్ ఫ్లూ అని కూడా పిలుస్తాము. దీనితో బాధపడుతున్న వ్యక్తి జ్వరం, అలసట, ఆకలి లేకపోవడం, దగ్గు, గొంతు నొప్పితో పాటు వాంతులు, విరేచనాలు కూడా ఉండవచ్చు అని డాక్టర్లు తెలియజేస్తున్నారు. ఇన్ఫ్లుఎంజా A (H1N1) సోకిన కొంతమందికి, వ్యాధి యొక్క ప్రభావాలు తీవ్రంగా ఉంటడంతో మరణానికి కూడా దారితీయవచ్చు అంటూ వెల్లడించారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!