African Swine Flu: కేరళలో ఆఫ్రికన్ స్వైన్‌ఫ్లూ కలకలం రేపింది. ఉత్తర కేరళ జిల్లాలోని కనిచర్ గ్రామంలో ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ వ్యాప్తి చెందిందని అధికారులు పేర్కొన్నారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ అక్కడి రెండు పొలాల్లో పందులను చంపాలని ఆదేశించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శుక్రవారం మలయంపాడి వద్ద ఉన్న ఓ పొలంలో స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారించారు. తదనంతరం జిల్లా అధికారులు ఆ ప్రాంతంలోని, సమీపంలోని 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మరొక పొలంలో పందులను చంపి, ప్రొటోకాల్ ప్రకారం మృతదేహాలను పూడ్చాలని ఆదేశించారు.
Read Also: ICMR Research: పోస్టు కోవిడ్ మరణాలపై అధ్యయనం.. రెంటు అధ్యయనాలు చేపడుతున్న ఐసీఎంఆర్
పందుల పెంపకం చుట్టూ ఒక కిలోమీటరు విస్తీర్ణంలో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించిన ప్రాంతాన్ని వ్యాధి సోకిన ప్రాంతంగానూ, 10కిలోమీటర్ల వ్యాసార్థాన్ని వ్యాధి నిఘా జోన్‌గానూ ప్రకటించామని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో పంది మాంసం పంపిణీ, అమ్మకం, ఇతర ప్రాంతాలకు రవాణా చేయడం మూడు నెలల పాటు నిషేధించబడినట్లు వారు తెలిపారు.గత రెండు నెలల్లో నష్టపోయిన పొలంలోని పందులను ఇతర పొలాలకు తరలించారో లేదో నిర్ధారించేందుకు అత్యవసరంగా నివేదిక ఇవ్వాలని జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ ఛైర్మన్ అయిన కలెక్టర్ స్థానిక అధికారులను కోరారు.
గ్రామపంచాయతీ పరిధిలో ఎక్కడైనా వ్యాధి తాజా కేసులు నమోదైతే వెంటనే విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేయాలని ఈ సందర్భంగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కుగ్రామంలోని వెటర్నరీ అధికారిని ఆదేశించారు.