Swine Flu Cases: తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా నగరవాసులనే కాదు గ్రామాలు సైతం విష జ్వరాలతో అల్లాడుతున్నాయి. అయితే ఏళ్ల తరబడి ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో స్వైన్ ఫ్లూ మరోసారి కలకలం సృష్టించింది. రాష్ట్రంలో నాలుగు కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. నాలుగు కేసులు నమోదైనట్లు హైదరాబాద్‌లోని నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ధృవీకరించింది. మాదాపూర్‌లో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన యువకుడు (23) తీవ్రమైన దగ్గు, ఇతర లక్షణాలతో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా, వారు అనుమానం వచ్చి నమూనాలను నారాయణగూడ ఐపిఎంకు పంపారు.
Read also: Manjira River: నాలుగో రోజు జలదిగ్బంధంలోనే ఏడు పాయల ఆలయం..
IPM స్వైన్ ఫ్లూని నిర్ధారించింది. టోలీచౌకికి చెందిన వృద్ధుడు (69), నిజామాబాద్ జిల్లా పిట్లం మండలానికి చెందిన వ్యక్తి (45), హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన మహిళ (51)కి స్వైన్‌ఫ్లూ సోకినట్లు గుర్తించారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన జార్ఖండ్‌కు చెందిన వృద్ధురాలు(68)కి కూడా స్వైన్ ఫ్లూ సోకినట్లు తేలింది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు తెలిపారు. రాష్ట్రంలో వర్షం భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఎక్కడ చూసిన బురద, చెత్త పేరుకుపోయి.. దోమలు, దుర్వాసన వల్ల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రోగాల బారిపడే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. రాష్ట్రంలో మరోసారి స్వైన్ ఫ్లూ కలకలం రేపడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Bhadrachalam: 43 అడుగుల చేరువలో భద్రాచలం వద్ద గోదావరి..