BJP: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుంపు హింసకు పాల్పడుతోంది. ఇటీవల ముర్షిదాబాద్, మాల్దాలో ఇలాంటి ఘటనలే జరిగాయి, రాళ్లదాడితో పాటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి.
ఏప్రిల్ 6న జరిగే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8న నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, సభను వాయిదా వేయాలనే ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తూ, పత్రాలను చింపేశారు. బీజేపీ సభ్యులకు ఎలాంటి పత్రాలు అందించొద్దని స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ కార్యదర్శిని ఆదేశించారు.
BJP: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. తాజా, బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. సందేశ్‌ఖాలీలో జరిగిన దురాగతాలపై విచారణ జరుపుతామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆయన అన్నారు.
Suvendu Adhikari: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న బీజేపీ నేత, బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారిపై దాడికి కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక ఇస్లామిక్ మతఛాందసవాద బృందం దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ సోర్సెస్ ప్రకారం.. బంగ్లాదేశ్‌కి చెందిన ఒక గ్రూపుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల సువేందు నివాసం ఉండే తూర్పు మేదినీపూర్‌లోని కాంటాయ్‌లో రెక్కీ నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
Suvendu Adhikari: బీజేపీ నాయకుడు, బెంగాత్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి బంగ్లాదేశ్‌కి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువుల అణిచివేతపై ఆయన మాట్లాడారు. బంగ్లాదేశ్‌కి 2 రాఫెల్ విమానాలు సరిపోతాయని అన్నారు. రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బసిర్హాట్‌లో బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఘోజదంగాలో బంగ్లాదేశ్‌లో హిందువులపై మతపరమైన హింసను ఖండిస్తూ నిరసన తెలిపారు.
West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు.
మైనారిటీ మోర్చాపై పశ్చిమబెంగాల్ బీజేపీ సీనియర్ నాయకుడు సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మైనారిటీ కమ్యూనిటీ నుంచి మద్దతు లభించలేదని.. అందుకే బీజేపీ సీట్లు గెలవలేకపోయిందన్నారు
మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్‌కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు.
పశ్చిమ బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు.