West Bengal BJP: ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ పై హత్యాచార, హత్య ఘటనకు ప్రధాన కారణం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయేనని బెంగాల్ అసెంబ్లీలో విపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. మమతా బెనర్జీ తక్షణమే సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆధారాలను ధ్వంసం చేస్తే దోషిని ఎలా నిర్ధారిస్తారంటూ ప్రశ్నించారు. కోల్‌కతా ఘటనకు నిరసనగా దాదాపు 5000 మందికి పైగా మహిళలు వీధుల్లోకి వచ్చారు.. ఈ ప్రదర్శనకు తాము సపోర్టు ప్రకటించామని సువేందు అధికారి వెల్లడించారు.
Read Also: Municipality: ఓఆర్‌ఆర్ పరిధిలోని గ్రామాలు సమీప మున్సిపాలిటీలలో విలీనం.. గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఇక, ఆర్జీ కర్ జూనియర్ డాక్టర్ విషాదాంతానికి సీఎం మమతా బెనర్జీ బాధ్యత వహించాలని బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. కాగా, పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక, సారస్వత ఫోరం ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు ఆర్జీ కర్ ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతా నగరంలో ఈరోజు (మంగళవారం) నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే, కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా కోల్‌కతాలో విపక్షాలు, మహిళా, ప్రజా సంఘాల నిరసనలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు మహిళలపై నేరాలకు చెక్ పెడుతూ కఠిన చట్టాన్ని తీసుకురావాలని కోరుతూ తాను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెండు లేఖలు రాసినా ఎలాంటి రిప్లై ఇవ్వలేదుని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. తన లేఖలపై మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచీ, కేంద్ర ప్రభుత్వం నుంచీ సమాధానం రాలేదని దీదీ వెల్లడించారు.