BJP: వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లో పలు ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగుతున్నాయి. చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న గుంపు హింసకు పాల్పడుతోంది. ఇటీవల ముర్షిదాబాద్, మాల్దాలో ఇలాంటి ఘటనలే జరిగాయి, రాళ్లదాడితో పాటు వాహనాలకు అల్లరి మూకలు నిప్పుపెట్టాయి. ఇదిలా ఉంటే, రాష్ట్రంలో అల్లర్లను సీఎం మమతా బెనర్జీ కంట్రోల్ చేయలేకపోతున్నారని బీజేపీ తీవ్ర స్థాయిలో విమర్శిస్తోంది. మమతా బెనర్జీ ముస్లిం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరుగుతున్నాయని బీజేపీ ఆరోపించింది.
ఈ ఘటనపై బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారి కూడా మండిపడ్డారు. “స్వామి వివేకానంద జన్మస్థలం కోల్‌కతా నుండి షాకింగ్ దృశ్యాలు! ధైర్యం, త్యాగం మరియు శౌర్యానికి చిహ్నంగా ఉన్న కాషాయ జెండాను కొంతమంది రాడికల్స్ గుంపు బస్సు నుండి బలవంతంగా తొలగించింది” అని అన్నారు. మమతా బెనర్జీ ముస్లింలను హిందువులపైకి రెచ్చగొట్టి బెంగాల్‌ని బంగ్లాదేశ్‌గా మార్చడానికి చూస్తున్నారని బీజేపీ ఎంపీ ఖర్గెన్ ముర్ము ఆరోపించారు.
Read Also: Moto Book 60 Laptop: 14-అంగుళాల డిస్ప్లే, ఇంటెల్ కోర్ 7 ప్రాసెసర్తో విడుదలకు సిద్దమైన మోటో బుక్ 60
ఇదిలా ఉంటే, ఇప్పుడు కోల్‌కతాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఓ బస్సుకు కట్టి ఉంచిన ‘‘ కాషాయ జెండా’’ ని తొలగించాలని, బస్సు డ్రైవర్‌ని చుట్టుముట్టిన వీడియో వైరల్ అయింది. దీనిని బీజేపీ షేర్ చేసి, ఉత్తర కోల్‌కతాలోని స్వామి వివేకానంద పూర్వీకుల ఇంటి ముందు ఈ సంఘటన జరిగిందని బీజేపీ పేర్కొంది. కోల్‌కతా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాగా మారిందా..? అని ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్ షేర్ చేశారు. పోలీసులు నిశ్శబ్ద ప్రేక్షకులుగా మారిపోయారని ఆరోపించారు. ఒక ఉన్మాద గుంపు హిందూ బస్సు డ్రైవర్‌ని చుట్టుముట్టి బలవంతంగా కాషాయ జెండాను తొలగించాలని భయబ్రాంతులకు గురిచేసిందని అన్నారు. అతడిని భయపెట్టి, అవమానించారని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘‘మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్‌లో లౌకికవాదం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు భయం, బుజ్జగింపుతో కుళ్లిపోయిన రాష్ట్రం’’ అని అన్నారు. ఇది హిందూ విశ్వాసంపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు.
Shocking scenes from Swami Vivekananda's birthplace, Kolkata!
A Saffron flag, a symbol of courage, sacrifice and valor, got forcefully removed from a bus by a mob of radicals.
Is this the harmony and tolerance Swamiji stood for? Under Mamata Banerjee's watch, such acts go… pic.twitter.com/is3SOgV6jJ— Suvendu Adhikari (@SuvenduWB) April 10, 2025