BJP: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానాంశంగా మారిన పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ వివాదం మరోసారి వార్తల్లోకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షేక్ షాజహాన్ లైంగిక వేధింపుల అంశం సంచలనంగా మారింది. తాజా, బీజేపీ నేత, ప్రతిపక్ష నేత సువేందు అధికారి మాట్లాడుతూ.. సందేశ్‌ఖాలీలో జరిగిన దురాగతాలపై విచారణ జరుపుతామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపేందుకు కమిషన్ ఏర్పాటు చేస్తామని మంగళవారం ఆయన అన్నారు.
Read Also: Xi Jinping: “ఎవరూ ఆపలేరు”.. న్యూఇయర్ సందేశంలో తైవాన్‌కి చైనా వార్నింగ్..
మంగళవారం ఆయన ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని సందేశ్‌ఖాలీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘జరిగిన దాన్ని మరిచిపోవాలని మమత ప్రజల్ని కోరుతున్నారు. సందేశ్‌ఖాలీ ప్రజలు మరిచిపోరు. నేను కూడా మరిచిపోను. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే సందేశ్‌ఖాలీ ఘటనపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మీరు సందేశ్‌ఖాలీ మహిళల్ని జైలుకు పంపారు. మహిళలపై తప్పుడు కేసులు పెట్టారు. బీజేపీ మిమ్మల్ని కూడా జైలుకు పంపుతుంది’’ అని అన్నారు. మేము చట్ట ప్రకారం వడ్డీతో ప్రతీకారం తీర్చుకుంటామని టీఎంసీని మెచ్చరించారు. షేక్ షాజహాన్ వంటి బలమైన టీఎంసీ నేతకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడినందుకు, మహిళలపై తప్పుడు కేసులు పెట్టాలని మమతా బెనర్జీ కుట్ర పన్నారని అధికారి ఆరోపించారు.
సువేందు పర్యటకు ఒక రోజు ముందు మమతా బెనర్జీ సందేశ్‌ఖాలీని సందర్శించారు. 2024లో టీఎంసీ నేతకు వ్యతిరేకంగా హింసాత్మక అల్లర్లు చెలరేగిన తర్వాత ఆమె తొలిసారిగా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ ఆరోపణల వెనక పెద్ద ఆట దాగుందని, డబ్బుతో కుట్ర పన్నుతున్నారని, ప్రజలంతా అది అబద్ధమని గ్రహించారని మమత అన్నారు