హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మాదాపూర్‌లోని గోల్డెన్ హైవ్ ఓయో లాడ్జిలో ప్రియ ( 25) అనే యువతి అనుమానాస్పద స్థితి మృతి చెందింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా పెనుమూరులో ఇంటర్ విద్యార్థిని మృతి సంచలనం రేపుతోంది.17వ తేదీ రాత్రి అదృశ్యమైన కావూరివారిపల్లె పంచాయతీ, ఠాణా వేణుగోపాలపురంకి చెందిన భవ్యశ్రీ .. గ్రామంలో వినాయక నిమజ్జనం చేస్తుండగా చెరువులో శవమై కనిపించింది.
హైదరాబాద్ లోని నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కనకదుర్గ వైన్స్ షాప్ లో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కనకదుర్గ వైన్స్ లో మద్యం సేవించడానికి వచ్చిన నాగి అనే వ్యక్తి.. మద్యం సేవించి షాప్ లోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. షాప్ సిబ్బంది కాళ్లు, చేతులు పట్టి రోడ్డుపై పడేశారు.. దీంతో సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
Newly Married Couple: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు.
Karimnagar: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును రేపుతున్నాయి. చివరకు ఆత్మహత్యలు, హత్యలకు కారణం అవుతున్నాయి. పెళ్లై పిల్లలు ఉన్న వారు పిల్లల జీవితాన్ని, తమ గౌరవాన్ని పట్టించుకోకుండా బరితెగిస్తున్నారు. భర్తలను కాదని ప్రియులతో సంబంధాలు నెరుపుతూ కొంతమంది భార్యలు హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అనేకం జరిగాయి. చాలా సందర్భాల్లో అక్రమ సంబంధాలు హత్యలకు కారణం అవుతున్నాయి.
Suspicious Death : పొలాన్ని కాపాడుకోవడానికి ఇద్దరు గ్రామస్తులు రాత్రి ఆలయంలో నిద్రించారు. గ్రామస్థులు తెల్లవారుజామున ఆలయానికి వచ్చి చూడగా ఇద్దరూ శవమై కనిపించారు.
షేక్‌పేట్ మాజీ ఎమ్మార్వో సుజాత అనుమానాస్పద మృతి చెందడం కలకలం రేపిన విషయం తెలిసిందే. సుజాత మృతితో పలు అనుమానాలు తావులేపుతున్న తరుణంలో నిమ్స్ వైద్యులు సుజాత మృతిపై క్లారిటీ ఇచ్చారు. మాజీ MRO సుజాత గుండె పోటుతోనే మృతి చెందారని నిమ్స్ వైద్యులు దృవీకంరించారు. శుక్రవారం సాయంత్రం గుండెపోటుతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన సుజాత శనివారం ప్రాణాలు విడిచారని, సుజాత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారని వైద్యులు తెలిపారు. మరికాసేపట్లో చిక్కడ పల్లికి సుజాత…
ఆంధ్రప్రదేశ్లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు…