Vallabhaneni Anil: టాలీవుడ్లో యూనియన్ వివాదానికి ఫుల్స్టాప్.. జానీ మాస్టర్‌పై నాన్ కోఆపరేషన్ ఎత్తివేత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Anil: టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, డాన్సర్స్ యూనియన్, ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సంబంధించిన వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. సినీ పరిశ్రమ పెద్దల సమక్షంలో జరిగిన కీలక సమావేశంలో అన్ని విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించి, పరిశ్రమలో సామరస్య వాతావరణం కొనసాగించేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఫెడరేషన్ ప్రతినిధులు, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్నకుమార్, చదలవాడ శ్రీనివాసరావు, అజయ్, ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయిరాజేష్, డాన్సర్స్ యూనియన్ అధ్యక్షురాలు సుమలత దేవి, జానీ మాస్టర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని మాట్లాడుతూ.. జానీ మాస్టర్ తనపై వచ్చిన అంశాలపై పూర్తి వివరణ ఇవ్వగా, ఫెడరేషన్ ఆ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. దీంతో ఆయనపై విధించిన నాన్ కోఆపరేషన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇకపై జానీ మాస్టర్ యథావిధిగా తన వృత్తిపరమైన బాధ్యతలను నిర్వహించవచ్చని స్పష్టం చేశారు.
డాన్సర్స్ యూనియన్‌లో నెలకొన్న అంతర్గత విభేదాలపై కూడా సమావేశంలో చర్చించామన్నారు. యూనియన్ కార్యవర్గంపై వచ్చిన ఆరోపణలు, సస్పెన్షన్ అంశాలను సర్వసభ్య సమావేశంలో చర్చించి ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ సూచించినట్లు వెల్లడించారు. సుమలత దేవి ఆధ్వర్యంలో ప్రస్తుత కార్యవర్గం కొనసాగుతుందని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులపై సభ్యుల అభిప్రాయం మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ వివాదం పరిష్కారంలో సినీ పరిశ్రమ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషించినట్లు సమావేశంలో వెల్లడించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా వెంటనే పరిష్కరించాలని ఇద్దరూ ప్రత్యేకంగా సూచించినట్లు తెలిపారు. అనంతరం జానీ వైఫ్, డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ సుమలత మాట్లాడుతూ.. మేము పోరాడిదే శ్రమ దోపిడి జరగకూడదనే, ఆ సమస్యను ఫెడరేషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందన్నారు. అనంతరం చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వల్లభనేని అనిల్ గారు, సుమలత గారు ఇలా ఇద్దరు పోరాడిదే, గొడవడిదే కార్మికుల సంక్షేమం కోసమే సుమలత గారు శ్రమ దోపిడి లేకుండా చూడాలని అనిల్ గారిని కోరారని, ఆయన కూడా ఆ సమస్య మీద దృష్టి సారించారని చెప్పారు. మొత్తానికి ఈ సమస్య ఇంతటితో సమసిపోయిందని చెప్పారు.
Also Read
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
- Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
తాజావార్తలు
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Explainer: రణక్షేత్రాన్ని తలపిస్తోన్న ఢిల్లీ..అక్టోబర్ 10న ఏం జరగనుంది?
-
Deputy CM Pawan Kalyan: పోలవరం పర్యటనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
Nana Patekar: క్రికెట్ అంటే నానాకు పిచ్చి.. విరాట్ అవుటైతే అన్నం కూడా తినేవారు కాదట..!
-
Explainer: చంద్రుడిపై అణు యుద్ధాలు!?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!