Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లండ్ మూడో వన్డే
- తొలి రెండు మ్యాచ్‌ల్లో రాణించలేకపోయిన హిట్‌మ్యాన్
- రోహిత్‌పై ఎలాంటి ఆందోళన అవసరం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma Will Play Big Innings Said Morne Morkel: భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ నేటితో ముగియనుంది. ఆదివారం (జులై 19) లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఈరోజు మధ్యాహ్నం మూడో వన్డే జరగనుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో (11, 26 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మపై ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. ఇదే సమయంలో లార్డ్స్ వన్డే హిట్‌మ్యాన్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చనే ఊహాగానాలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ ఇప్పటికే ఖండించింది.
మూడో వన్డేకు ముందు జరిగిన మీడియా సమావేశంలో భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ రోహిత్ శర్మకు పూర్తి మద్దతు ప్రకటించాడు. ‘కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం ఈ సిరీస్‌లో ప్రతి ఓపెనర్‌కూ చాలా కష్టంగా ఉంది. ఇంగ్లండ్ పిచ్‌లపై బంతి బాగా స్వింగ్ అవుతుంది. దాంతో బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ లాంటి సీనియర్ ఆటగాడు తిరిగి తన లయను అందుకుంటాడు. ఆ నమ్మకం నాకు ఉంది. రోహిత్ గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సవాళ్లను ఎదుర్కొని విజయవంతంగా తిరిగి వచ్చాడు. అతనికి అపారమైన అనుభవం ఉంది. బ్యాటింగ్ విభాగంలో అతడు ఉండటం జట్టుకు ప్రశాంతతను ఇస్తుంది. అతడి ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. త్వరలోనే పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడు’ అని మోర్కెల్ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
- Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండో వన్డేలో భారత బౌలర్ల ప్రదర్శనపై కూడా మోర్కెల్ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘బౌలర్లు మంచి వేగంతో బంతులు వేయడంతో పాటు సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. ముఖ్యంగా ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌లను మిడిల్ ఓవర్లలో అదనపు బౌన్స్‌ను ఉపయోగించుకునేలా వ్యూహాత్మకంగా వినియోగించాము. అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉంది’ అని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ చెప్పాడు.
ఇప్పటికే వన్డే సిరీస్ 1-1తో సమంగా ఉంది. దాంతో లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డే ఉత్కంఠభరితంగా మారింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకోనుంది. రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం, భారత బ్యాటింగ్ విభాగం సమష్టిగా రాణించడం టీమిండియా విజయావకాశాలను మరింత పెంచనుంది. అభిమానులంతా కూడా హిట్‌మ్యాన్ నుంచి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!