Bapatla: తెలియక చేస్తే తప్పు.. అదే తప్పు తెలిసి చేస్తే ముప్పు.. ఇది తెలిసి కొందరు అడ్డదారులు తొక్కుతారు. పవిత్రమైన వివాహ బంధాన్ని పక్కన పక్కన పెట్టి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో వివాహేతర సంబంధాలతో నేరాలు చేసిన ఘటనలు.. ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే బాపట్ల జిల్లా లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. బాపట్ల జిల్లా లోని పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు గ్రామం లో దాసు అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతను ప్రస్తుతం బాపట్ల జిల్లా కొరిశపాడు పోలీసు స్టేషన్ లో ఏఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అతను నివాసం ఉంటున్న గ్రామం లోనే ఓ ఇంటి ఆవరణలో విగతీజీవిగా పడివున్నాడు.
Read also:United Nations: హమాస్, ఇజ్రాయిల్ వివాదంపై ఐక్యరాజ్యసమితి తీర్మాన సభ.. గైర్హాజరైన భారత్
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు ఏఎస్సై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు మాట్లాడుతూ.. ఏఎస్సై ఓ మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాడని తెలిపారు. కాగా ఆ వివాహేతర సంభంధం కారణంగానే ఎవరైనా ఏఎస్సైను హత్య చేసి ఉంటారు అనే అనుమానాన్ని గ్రామస్థులు వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.