హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
గుంటూరులో ఆర్మ్‌డ్ రిజర్వ్ (AR) హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తుండగా తుపాకీ పేలడంతో తలలోకి తూటా దూసుకెళ్లింది. ఈ క్రమంలో వంశీకృష్ణ అనే హెడ్ కానిస్టేబుల్.. అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయాడు.
తిరుపతిలో ఓ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు.. తిరుపతి రూరల్ లో ఓ ప్రైవేట్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న వెంకటప్రసాద్.. స్థానికంగా శ్రీపురం కాలనీలో నివాసం ఉంటున్నారు.. 2012లో తిరుపతికి చెందిన మాధురిని ప్రేమించి.. పెళ్లి చేసుకున్నాడు వెంకట ప్రసాద్ ..
యూపీ రాజధాని లక్నోలోని లోహియా లా యూనివర్సిటీ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హాస్టల్ గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థిని గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న విద్యార్థిని చూసిన తోటి విద్యార్థులు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. కానీ.. అక్కడికి తీసుకెళ్లగానే వైద్యులు ఆమె మరణించినట్లు ప్రకటించారు. మృతురాలి తండ్రి ఒక ఐపీఎస్ అధికారి. అతను ఎన్ఐఏ (NIA)లో విధులు నిర్వహిస్తున్నాడు. ఐపీఎస్ కుమార్తె మరణ వార్తతో పోలీసు శాఖలో కలకలం రేగింది.
కొంపల్లి లోని శ్రీ చైతన్య స్కూల్ అండ్ హాస్టల్స్ లో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. శ్రీ చైతన్య పాఠశాల K4 క్యాంపస్ హాస్టల్ 7 వ తరగతి చదువుతున్న మల్లికార్జున్ అనే విద్యార్థి మృతి చెందాడు.
Bapatla: తెలియక చేస్తే తప్పు.. అదే తప్పు తెలిసి చేస్తే ముప్పు.. ఇది తెలిసి కొందరు అడ్డదారులు తొక్కుతారు. పవిత్రమైన వివాహ బంధాన్ని పక్కన పక్కన పెట్టి వివాహేతర సంబంధాలను కొనసాగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. గతంలో వివాహేతర సంబంధాలతో నేరాలు చేసిన ఘటనలు.. ప్రాణాలను పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు. తాజాగా అలాంటి ఘటనే బాపట్ల జిల్లా లో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. బాపట్ల జిల్లా లోని పిట్టలవానిపాలెం మండలం సంగుపాలెం కోడూరు గ్రామం లో…