H-FAST Raids: కల్తీగాళ్ల గుండెల్లో రైళ్లు.. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో H-FAST భారీ దాడులు..
- హైదరాబాద్, రంగారెడ్డిలో ఏకకాలంలో H-FAST దాడులు
- బొద్దింకలు, వాడిన నూనెలతో ఆహార తయారీ బట్టబయలు
- ఎక్స్పైరీ వస్తువులు, కృత్రిమ రంగులు భారీగా సీజ్
- FSSAI లైసెన్స్ లేకుండా వ్యాపారం.. ఆరుగురిపై కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భాగ్యనగరంలో ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మరోసారి ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఆహార కల్తీని అరికట్టేందుకు ఏర్పాటైన కమిషనర్ టాస్క్ ఫోర్స్ ‘H-FAST’ శనివారం భారీ ఆపరేషన్ నిర్వహించింది. నగరంలోని పలు ప్రాంతాల్లోని ఆరు ప్రధాన ఆహార తయారీ, విక్రయ సంస్థలపై అధికారులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు జరిపారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూడటంతో ఆయా సంస్థలకు చెందిన ఆరుగురు నిర్వాహకులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
బొద్దింకలు, కీటకాల మధ్యే తినుబండారాల తయారీ
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఐస్‌క్రీమ్ యూనిట్లు, బేకరీలు, మురుకుల (జంతికల) తయారీ కేంద్రాలతో పాటు బేగంబజార్‌లోని ఒక ప్రముఖ కిరాణా స్టోర్‌లో ఈ దాడులు జరిగాయి. ఈ సందర్భంగా తయారీ కేంద్రాల్లోని అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పెస్ట్ కంట్రోల్ (కీటకాల నివారణ చర్యలు) చేయకపోగా.. ఈగలు, కీటకాలు, బొద్దింకల మధ్యే నిర్వాహకులు ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ పనిచేసే సిబ్బంది కనీసం హెయిర్ నెట్స్, గ్లౌజులు కూడా ధరించకుండానే తినుబండారాలను ప్యాక్ చేస్తున్న వైనం బయటపడింది. అంతేకాకుండా, ఎలాంటి వాటర్ టెస్టింగ్ (నీటి పరీక్షలు) చేయని అపరిశుభ్రమైన నీటితోనే ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఐటమ్స్ తయారు చేస్తున్నట్లు తేలింది.
Also Read
- TGPSC Syllabus Changes: సిలబస్ మార్పులపై TGPSC కీలక ప్రకటన..
- Hyderabad: ట్యాంక్ బండ్‌పై హైటెన్షన్.. గణేశ్ నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన
- Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
వాడిన నూనెలే మళ్లీ మళ్లీ.. కృత్రిమ రంగుల కలకలం
ఈ తనిఖీల్లో ప్రజల ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారో స్పష్టమైంది. ఒకసారి వాడిన వంట నూనెను (Used Cooking Oil) పదే పదే వేడి చేస్తూ, మురుకులు, బేకరీ పదార్థాల తయారీకి వాడుతున్నట్లు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే ఆకర్షణీయంగా కనిపించడం కోసం తినుబండారాలలో ప్రమాదకరమైన కృత్రిమ రంగులను (Artificial Colours) విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్లు గుర్తించి, ఆ రంగులను, వందల లీటర్ల వాడిన నూనెను సీజ్ చేశారు. వీటితో పాటు బేగంబజార్ కిరాణా దుకాణంలో భారీగా ఎక్స్పైరీ డేట్ (గడువు ముగిసిన) అయిన ఆహార ఉత్పత్తులు, నకిలీ బ్రాండ్ల పేరుతో అమ్ముతున్న ప్యాకెట్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ లేదు.. జైలుకు పంపేందుకు సిద్ధం
సమీక్షించిన ఆరు సంస్థలలో చాలా వాటికి కనీసం ఫుడ్ సేఫ్టీ అథారిటీ (FSSAI) నుంచి పొందాల్సిన చట్టబద్ధమైన లైసెన్స్‌లు కూడా లేవని, నిబంధనలకు విరుద్ధంగా దొంగచాటుగా యూనిట్లను నడుపుతున్నారని అధికారులు వెల్లడించారు. పట్టుబడిన ఆరుగురు నిందితులపై ఆహార భద్రతా చట్టం కింద కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు.
డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకుని ప్రజల ఆరోగ్యంతో, ముఖ్యంగా అమాయక పిల్లలు తినే ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఫుడ్స్‌తో చెలగాటమాడితే ఎంతటి వారైనా సరే ఊపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో H-FAST టాస్క్ ఫోర్స్ దాడులు మరింత ముమ్మరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
-
Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
-
Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
-
EPFO నిబంధనల్లో కీలక మార్పు.. ఏం మారుతుందో తెలుసుకోండి..!
-
Sonia Gandhi: సోనియాగాంధీకి కోర్టు షాక్.. పౌరసత్వంపై విచారించాలని ఆదేశం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!