AP Crime: పర్యాటక కేంద్రం అరకులోయలో ఓ జంట అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగా మారింది. కరకవలస సమీపంలోని కొండపై యువతీ, యువకుడు చెట్టుకు ఉరివేసుకుని వున్నట్టు పశువుల కాపర్లు గుర్తించారు. మృతుల వయసు 20 ఏళ్లలోపు కాగా.. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణంగా ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. యువతి చున్నీ ఇద్దరి మెడకు చుట్టుకొని, చెట్టుకొమ్మకు ఇరువైపులా మృతదేహాలు వేలాడుతున్నాయి. వీరు ఆత్మహత్యకు పాల్పడ్డారా, లేక ఎవరైనా హత్య చేసి మృతదేహాలు వేలాడదీశారా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది.
Read Also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
అయితే, అరకులోయలో నిన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నది ఓ ప్రేమజంటగా గుర్తించారు పోలీసులు.. మృతులను రాజమండ్రి హుకుంపేట ప్రాంతానికి చెందిన జ్యోత్స్న, చైతన్యగా గుర్తించారు. మృతదేహాలను అరకులోయ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.. ఆత్మహత్య చేసుకున్న యువకుడు చైతన్య వయసు 17 సంవత్సరాలు, జ్యోతి 14 సంవత్సరాలుగా తేల్చారు.. ఇరు కుటుంబాలు గతంలో విజయనగరం జిల్లా జామిలో నివసించేవారు కాగా.. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా హుకుంపేటలో నివాసం ఉంటున్నారు. గత మంగళవారం నాడు వీరు ఇరువురు ఇంటి వద్ద నుండి వెళ్లిపోయారు.. ఇక, అరకులోయ మండలం కటికి జలపాతాన్ని నిన్న ఆదివారం సందర్శించారు.. అక్కడి నుంచి దగ్గర్లోనే ఉన్న కొండపై ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.