Newly Married Couple: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో యువకుడికి అంగరంగవైభవంగా పెళ్లి జరిగింది. కుటుంబమంతా ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోకి కొత్త కోడలికి అట్టహాసంగా స్వాగతం పలికారు. వివాహానంతర కార్యక్రమాలన్నీ ముగించుకుని, కొత్తగా పెళ్లయిన జంట శోభనం కోసం పడకగదికి వెళ్లారు. తెల్లారే సరికి పెళ్లింట్లో విషాదం నెలకొంది. శోభనం కోసం గదిలోకి వెళ్లిన కొత్త జంట అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆనందోత్సవాలు జరుపుకుంటున్న ఇంటిలో ఒక్కసారిగా విషాదం నిండుకుంది. కొడుకు, కోడలు మృతదేహాలను చూసి ఇంట్లో కలకలం రేగింది. ఈ ఘటనతో గ్రామం మొత్తం ఉలిక్కిపడింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఇప్పుడు కొత్తగా పెళ్లయిన జంట మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక తర్వాతే తేలనుంది.
Read Also:Telangana: నిజామాబాద్ బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం..
వివరాల్లోకి వెళితే.. బహ్రైచ్‌లోని కైసర్‌గంజ్‌లోని గోధియా నంబర్ ఫోర్‌లో నివసిస్తున్న ప్రతాప్‌కు గోధియా.. నంబర్ టూలోని గుల్లన్‌పూర్వా గ్రామానికి చెందిన పుష్పయాదవ్‌తో మే 30, మంగళవారం వివాహం జరిగింది. కోలాహలంగా పెళ్లి ఊరేగింపుతో వధువు గుమ్మం వద్దకు చేరుకుంది. అన్ని లాంఛనాలతో వివాహ వేడుక పూర్తయింది. ఆ తర్వాత బుధవారం వరుడు వధువుతో కలిసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో కొత్త కోడలుకు స్వాగతం పలికేందుకు పూర్తి సన్నాహాలు చేశారు. రాత్రి నవ దంపతులు నిద్రించడానికి తమ గదిలోకి వెళ్లారు. అయితే ఉదయం చాలా ఆలస్యమైనా ఇద్దరూ బయటకు రాలేదు.
Read Also:CM KCR TOUR: జూన్ 9న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ పర్యటన
మొదట్లో కుటుంబం పెద్దగా పట్టించుకోలేదు. వివాహ వేడుకలో అలసిపోవడంతో దంపతులు ఆలస్యంగా నిద్రపోయి ఉంటారని కుటుంబ సభ్యులు భావించారు. అయితే చాలా సేపటికి తలుపులు తెరుచుకోకపోవడంతో కుటుంబ సభ్యులు వారి గది తలుపు తట్టారు. కానీ లోపల నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత కిటికీలోంచి చూసే సరికి పుష్ప, ప్రతాప్ మంచంపై విగత జీవులుగా పడి ఉన్నారు.కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి గదిలోకి వెళ్లి చూడగా ఇద్దరూ శవాలై కనిపించారు. అనంతరం పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేశారు. విచారణ, పోస్ట్‌మార్టం నివేదిక తర్వాతే మృతికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందని పోలీసులు చెప్పారు.