Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
- ఫంగస్‌కు నిమ్మకాయ, బేకింగ్ సోడా చిట్కా
- వెనిగర్, టూత్‌పేస్ట్‌తో ఈజీ క్లీనింగ్
- తేమ తగ్గించడమే అసలు పరిష్కారం
- ఫంగస్ మళ్లీ రాకుండా ఈ జాగ్రత్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Tips: వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఇళ్లలో తేమ చేరడం, గోడలపై పాకురు (ఫంగస్) పట్టడం సర్వసాధారణంగా చూస్తుంటాం. ఇది ఇంటి అందాన్ని పాడు చేయడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా ఎంతో హానికరం. ముఖ్యంగా ఇంట్లో ఉండే పిల్లలు, వృద్ధులు, అలర్జీ లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి ఈ పాకురు వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే, దీని నివారణ కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కొనాల్సిన అవసరం లేదు. మన వంటగదిలో సులభంగా లభించే కొన్ని సాధారణ వస్తువులతోనే గోడలపై ఏర్పడిన ఫంగస్‌ను మాయం చేయవచ్చు.
నిమ్మకాయ, బేకింగ్ సోడాతో మొండి మరకలకు చెక్
గోడలపై ఉన్న మొండి పాకురు మరకలను వదిలించడంలో నిమ్మరసం, బేకింగ్ సోడా కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని, దానికి నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను బ్రష్ లేదా పాత గుడ్డ సహాయంతో పాకురు పట్టిన చోట పూసి, కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత దానిని మెల్లగా రుద్ది తుడిచేస్తే మరకలు చాలా వరకు తొలగిపోతాయి. ఈ పద్ధతి వల్ల ఫంగస్ మరకలు వదిలిపోవడమే కాకుండా, దాని వల్ల వచ్చే చెడు దుర్వాసనను కూడా ఈ మిశ్రమం పూర్తిగా పీల్చేసుకుంటుంది.
Also Read
- Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
- Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
తెల్ల వెనిగర్, టూత్‌పేస్ట్‌ల మ్యాజిక్
వంటగదిలో వాడే తెల్ల వెనిగర్ కూడా పాకురును క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక స్ప్రే బాటిల్లో వెనిగర్ నింపి, ఫంగస్ పట్టిన గోడలపై నేరుగా స్ప్రే చేసి, ఒక 20 నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత పొడి బట్టతో శుభ్రంగా తుడిచేయాలి. దీనివల్ల గోడలు మళ్లీ నీట్‌గా మారతాయి. అలాగే గోడలపై ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న లేత రంగు పాకురు మరకలను వదిలించడానికి టూత్‌పేస్ట్ ఉపయోగపడుతుంది. కొద్దిగా టూత్‌పేస్ట్ తీసుకుని ఫంగస్ ఉన్న చోట అప్లై చేసి, బ్రష్‌తో మెల్లగా రుద్ది తడి గుడ్డతో తుడిచేస్తే మరకలు తేలికగా వదిలిపోతాయి. మరోవైపు గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు గోడలు తడిగా మారితే, పాత వార్తాపత్రికలను ఆ గోడలకు అంటించి కాసేపు ఉంచడం ద్వారా అవి గోడల్లోని తడిని పీల్చుకునేలా చేయవచ్చు.
పాకురు మళ్లీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
యు.ఎస్. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (EPA) నివేదిక ప్రకారం, ఇళ్లలో నల్లటి పాకురు పట్టకుండా ఉండాలంటే ఇంట్లోని తేమను నియంత్రించడమే ఏకైక మార్గం. అందుకోసం ఇళ్లలోకి సూర్యరశ్మి, స్వచ్ఛమైన గాలి వచ్చేలా పగటిపూట కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి, ఎందుకంటే సూర్యరశ్మి వల్ల ఫంగస్‌కు కారణమయ్యే బ్యాక్టీరియా నశిస్తుంది. వర్షాలు పడేటప్పుడు వంటగది, బాత్రూమ్లలోని తేమ బయటకు పోవడానికి ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఆన్ చేసి ఉంచాలి లేదా రూమ్ డీహ్యూమిడిఫైయర్‌ను ఉపయోగించి ఇంటి లోపల తేమ శాతాన్ని ఎప్పుడూ 50% కంటే తక్కువగా ఉంచాలి. గోడల చుట్టూ గాలి సరిగ్గా ప్రసరించడానికి వీలుగా ఫర్నిచర్‌ను గోడలకు పూర్తిగా అంటించకుండా కొద్దిగా దూరంగా జరిపి పెట్టాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇంట్లో ఎక్కడైనా పైపులు లేదా పైకప్పు లీక్ అవుతుంటే వెంటనే రిపేర్ చేయించాలి, ఎందుకంటే చిన్న లీకేజీల వల్ల కూడా గోడలు తేమను లాగి పాకురు పట్టే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్లో దొరికే ఫంగస్ నివారణ లిక్విడ్స్ వాడుతున్నట్లయితే, కెమికల్స్ వల్ల ఇబ్బంది కలగకుండా కచ్చితంగా చేతులకు గ్లౌజెస్, ముక్కుకు మాస్క్ ధరించి మాత్రమే క్లీనింగ్ ప్రక్రియ చేపట్టాలి.
తాజావార్తలు
-
Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
AP Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. 4 రోజుల పాటు వర్షాలు.. పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరిక
-
Delhi Protest: దీపావళి వరకు ఢిల్లీలో నిరసనలు వద్దు.. అమిత్ షాకు వ్యాపారుల లేఖ.!
-
CJP protest: CJPకి ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ‘తిరంగా’ నిరసనకు అనుమతి.!
ట్రెండింగ్
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!