Andhra Pradesh Crime: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. లవర్స్ డే రోజు ప్రాణాలు విడిచింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh Crime: ప్రేమికుల రోజు నాడే ఏపీలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ఈ ఘటన జరిగింది.. కాట్రేనికోన మండలం కుండలేశ్వరం గ్రామానికి చెందిన జొన్నాడ సత్య దుర్గా ప్రసాద్.. ముమ్మిడివరం మండలం సోమిదేవరపాలెం గ్రామానికి చెందిన పెయ్యల దుర్గలు.. కొంత కాలం ప్రేమించుకున్నారు.. ఆ తర్వాత 2022లో పెద్దల సమక్షంలో పేళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.. అయితే, గత కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు..
Read Also: Marriage Muhurat: తెలుగు రాష్ట్రాల్లో మొదలైన పెళ్లి సందడి.. రానున్న మూడు నెలల్లో మంచి ముహూర్తాలు..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
ఇక, మీ కూతురు ఆరోగ్యం బాగోలేదంటూ.. దుర్గ తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు దుర్గా ప్రసాద్.. హుటాహుటిన బయలుదేరి.. కూతురు ఇంటికి వెళ్లిన దుర్గ తల్లిదండ్రులు షాక్ తిన్నారు.. ఆమె మరణించి ఉండడంతో మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.. అల్లుడు దుర్గాప్రసాదే తమ కుమార్తెను కొట్టి చంపాడని వారు ఆరోపిస్తున్నారు.. దుర్గ సోదరుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. మరోవైపు.. దుర్గ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా దుర్గ ప్రాణాలు తీసుకుందా? నిత్యం గొడవలు జరుగుతుండడంతో.. దుర్గాప్రసాదే.. దుర్గ ప్రాణాలు తీశాడా? ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.. మొత్తంగా ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్న ఓ యువతి ప్రాణాలు.. ప్రేమికుల రోజు నాడే పోవడం విషాదంగా మారింది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!