మీరు ఆశీర్వదించండి… తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతి నగర్ కు చేరుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమని అన్నారు. వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షం గా ఉందని పేర్కొన్నారు. కులాలకు…
సూర్యాపేట కాంగ్రెస్‌లో స్థానికత అంశం ఒక్కసారిగా తెరపైకి వచ్చి చర్చగా మారింది. ఇక్కడ మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత పటేల్ రమేష్‌రెడ్డి మధ్య ఓ రేంజ్‌లో వర్గపోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేయడానికి ఇద్దరూ కుస్తీ పడుతున్నారు. దీంతో రెండు వర్గాలు హోరాహోరీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.. అదే విధంగా మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఇప్పుడు లోకల్.. నాన్ లోకల్ అంశం వీరి మధ్య చిచ్చు పెడుతోంది. రమేష్‌రెడ్డిపై ఆ మధ్య…
దేశంలోని ఏ రాష్ట్రంతో తెలంగాణ రాష్ట్రానికి పోటీ లేదని, రాష్ట్రంలోని పల్లెలకు, పట్టణాలకు మధ్యనే పోటీ ఉందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మొదటి రోజు పట్టణ ప్రగతిలో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 25, 39, 9, 36 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. మంచి నాగరిక సమాజం తయారు కావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రం వయసులో తక్కువ అయినా దేశంలో ఉన్నా మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అభివృద్ధిలో ఒకడుగు ముందే…
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి పెద్దగట్టు సమీపంలో బాలుడు అదృశ్యం అయిన ఘటన కలకలం సృష్టించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 1న మగ శిశువు అదృశ్యమవడంతో తల్లిదండ్రుల పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ కు చెందిన సంజీవరెడ్డి 20 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతంలో రెండు వివాహాలు చేసుకున్న ఆయన ఎనిమిదేళ్ళ క్రితం సంచార జాతికి చెందిన…
తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మైన సమస్య వడ్లు కొనుగోళ్లని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. రైతులు తాము వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా ”రైతుగోస” పేరుతో సమస్యలను ప్రస్తావించినా సీఎం స్పందిచలేదని…
వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. ఇది బంగారు తెలంగాణ కాదు…బాధల తెలంగాణ అంటూ కేసీఆర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. బార్లు – బీర్లు – ఆత్మహత్యల తెలంగాణ గా మారింది రాష్ట్రం. ఉద్యమం చేసిండని కేసిఆర్ ను 2సార్లు ముఖ్యమంత్రిని చేస్తే ఈ ప్రజలకు ఆయన చేసిందేమిటి? https://ntvtelugu.com/anchor-anasuya-fires-on-netizen/ ఎన్నికలప్పుడు గారడీ మాటలు తప్ప కేసిఆర్ తెలంగాణను ఉద్దరించేది ఏమిటి? మళ్ళీ కేసిఆర్ మాటలకు మోసపోవద్దని హితవు పలికారు వైఎస్ షర్మిల.…
ఈదేశంలో ప్రతి వస్తువుకి గరిష్ట చిల్లర ధర (MRP) వుంటుంది. కానీ, రైతుల పంటలకు మాత్రం ధర లభించడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కంది రైతులకు కష్టాలు తప్పడం లేదు. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, నాణ్యత పేరుతో అధికారులు కొర్రీలు పెడుతున్నారు. తమకు కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గిట్టుబాటు ధర రాక కందుల రైతులు తలలు పట్టుకుంటున్నారు. 42 వేల ఎకరాల్లో…
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. అనారోగ్యంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మల్లు స్వరాజ్యం. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 13 ఏళ్ళ వయసులో పోరాటంలో పాల్గొని రజాకార్లను ఎదిరించిన ధీర వనితగా పేరుంది. 1931లో నల్లగొండ జిల్లా (ఇప్పుడు సూర్యాపేట) తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో జన్మించిన స్వరాజ్యం. రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. మల్లు స్వరాజ్యం కరివిరాల కొత్తగూడెం…
తెలంగాణలో ఓ కాలేజీ ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది.. సూర్యాపేట మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థిని ర్యాగింగ్ చేశారు సీనియర్ విద్యార్ధులు… శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు సీనియర్లు.. బాధిత విద్యార్థి ఒంటిపై ఉన్న దుస్తులను బలవంతంగా తొలగించి ఫొటోలు తీశారు.. జుట్టు కూడా కత్తిరించినట్టు తెలుస్తోంది.. ఈ ఘటనతో భయాందోళనకు గురైన బాధిత విద్యార్తి.. హైదరాబాద్‌లోని తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలిపాడు.. దీంతో, వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ 100కు…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి…