ఆత్మకూర్(ఎస్) మండలం ఎస్ఐ లింగయ్య అరాచకాలతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. గతంలో ఉప్పల్ లో ఎస్ఐ గా పనిచేసిన లింగయ్యపై అనేక ఆరోపణలున్నాయి. ఓ కేసులో సస్పెన్షన్ కు గురై సూర్యాపేట కు బదిలీ అయ్యారు లింగయ్య. అక్కడికి వెళ్ళాక కూడా లింగయ్య తన స్వభావం మార్చుకోలేదంటున్నారు. సూర్యాపేట లోనూ లింగయ్య అరాచకాలు ఆగలేదు. ఓ వ్యక్తిని ఇష్టానుసారంగా లాఠీతో కొట్టడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు. లాక్ డౌన్ లోను ఇష్టారాజ్యంగా లాఠీకి పని చెప్పిన ఎస్ఐ…
పేదవాడైనా.. ధనవంతుడైనా తనకు న్యాయం కోసం కోర్టుల వైపే చూస్తారు. అందరికీ న్యాయం దక్కాలనేదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా జై భీమ్… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మార్మోగిపోతోంది. అందులో అన్యాయంగా అమాయకుడిపై కేసులు మోపి.. జైల్లో చిత్ర హింసలు ఎలా పెడతారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా…
సూర్యాపేట జిల్లాలో దారుణమైన ఘటన వెలుగుచూసింది.. సూర్యాపేట మండలం రాజు నాయక్ తండా ఓ మహిళలను అందరూ చూస్తుండగా కళ్లలో కారం కొట్టి, వివస్త్రను చేసి వీధుల్లో తిప్పుతూ దాడి చేశారు కొందరు వ్యక్తులు.. అయితే, ఇవాళ ఆ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.. మహిళను వివస్త్రను చేసి కళ్లలో కారం కొట్టి వీధుల్లో తిప్పుతూ దాడి చేసిన తండావాసులను అరెస్ట్ చేసేందుకు ఆ గ్రామానికి వెళ్లారు సూర్యాపేట రూరల్ పోలీసులు.. అయితే, తాము ఎలాంటి తప్పు చేయలేదని…
కరోనా కాలంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం ఇస్తాం.. అవసరమైతే ఇంకా పొడిగిస్తామని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రెండో రోజు సూర్యాపేట జిల్లాలో కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాద్ర సాగుతోంది.. సూర్యాపేటలోని కల్నల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలుగా ఎంపికైన మెరుగు మారతమ్మ నివాసంలో అల్పాహార విందు చేశారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి.. కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ…
గుంటూరు జిల్లాలోని పులిచింతల సమీపంలో ఆదివారం ఉదయం భూప్రకంపనలు వచ్చాయి. ఈరోజు ఉదయం 7:15 గంటల నుంచి 8:20 గంటల మధ్యలో మూడుసార్లు భూమి కంపించింది. భూకంపలేఖినిపై దీని తీవ్రత 2.3,2.7,3 గా నమోదయింది. పులిచింతలతో పాటుగా తెలంగాణలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోనూ, సూర్యపేటలోనూ స్వల్పంగా భూమి కంపించినట్టు ఎన్‌జీఆర్ఐ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిలోపల పొరల్లో వస్తున్న మార్పుల కారణంగా భూప్రకంపనలు కలుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. Read: “పాగల్” టైటిల్ వీడియో సాంగ్ రిలీజ్
కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నా.. ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి.. తాజాగా.. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కరోన కలకలం సృష్టించింది.. సూర్యాపేట నుండి వచ్చిన వలస కూలీలకు 16 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది… దీంతో. వారితో కలిసి పనిచేసినవారిలో టెన్షన్ మొదలైంది.. దీంతో.. వారితో కలిసి పనిచేసిన 200 మంది వలస కూలీలకు రేపు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు వైద్యశాఖ అధికారులు.. మరోవైపు కరోనా పాజిటివ్ వచ్చిన వారిని…
సూర్యాపేటలో కర్నల్ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్.. భారత్-చైనా సరిహద్దులో విధులు కర్నల్ సంతోష్ బాబు విధులు నిర్వహిస్తుండగా.. లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంట 15 జూన్ 2020న చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరోచితంగా పోరాటం చేసి అమరుడయ్యారు.. ఆయనతో పాటు మరికొందరు భారత సైనికులు అమరులయ్యారు.. ఆ వీరుడు నేలకొరిగి ఏడాది గడిచింది.. దీంతో.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలో కర్నల్ సంతోష్ బాబు 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని…
కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా భయంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో క్యూలు కడుతున్నారు ప్రజలు. కొన్ని చోట్ల పెద్ద సంఖ్యలో క్యూలు ఉంటున్నాయి. క్యూలైన్లో ఎక్కువ మంది నిలబడితే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో ప్రజలు తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డులను క్యూలైన్లో ఉంచి దూరంగా నిలబడుతున్నారు. ఒకప్పుడు సినిమా హాళ్ల ముందు ఎక్కువ క్యూలైన్లు కనిపించేవి. ఈ కరోనా కాలంలో హాస్పిటల్స్ ముందు, వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద పెద్ద సంఖ్యలో…