సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్ పల్లి పెద్దగట్టు సమీపంలో బాలుడు అదృశ్యం అయిన ఘటన కలకలం సృష్టించింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 1న మగ శిశువు అదృశ్యమవడంతో తల్లిదండ్రుల పోలీసులను ఆశ్రయించారు. బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం నూతనకల్ కు చెందిన సంజీవరెడ్డి 20 ఏళ్ళ క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లి కుటుంబానికి దూరంగా ఉంటున్నారు. గతంలో రెండు వివాహాలు చేసుకున్న ఆయన ఎనిమిదేళ్ళ క్రితం సంచార జాతికి చెందిన ఓ మతిస్థిమితం లేని మహిళను పెళ్లి చేసుకున్నాడు. వివాహ అనంతరం అక్కడక్కడ డేరాలు వేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరికి ఇద్దరు కుమార్తెలు తో పాటు నాలుగు నెలల బాలుడు ఉన్నాడు. విజయవాడ కొంతకాలంగా దురాజ్పల్లి పెద్దగట్టు సమీపంలో డేరా వేసుకుని జీవనం సాగిస్తున్నారు. రోజు మాదిరిగానే నిద్రలేచి వేకువజామున లేచి చూసేసరికి నాలుగు నెలల బాలుడు కనిపించలేదు.
మతిస్థిమితం లేని విజయలక్ష్మి ఎవరో వచ్చి బాలుడిని తీసుకెళ్లారని చెప్పడంతో పరిసర ప్రాంతాల్లో వెతికారు. బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సంజీవరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఎస్సై విష్ణు మూర్తి చేపట్టారు. 5 బృందాలుగా విడిపోయి 10 రోజులుగా గాలిస్తున్నా శిశువుజాడ కనిపించలేదు. దీంతో శిశువు తల్లిదండ్రులు కన్నీమున్నీరవుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ రంగంలోకి దిగి దాదాపు 60మందికి విచారించినా శిశువు సమాచారం అందకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిడ్నప్ కోణంలో…. శిశువు అమ్మకం.. కుటుంబ, ఆస్తి తగాదాల కోణంలో కొనసాగుతున్న విచారణ చేపట్టారు. సూర్యాపేట జిల్లాలోనే ఇది రెండవ ఘటన కావడం, పోలీసుల విచారణలో కూడా క్లారిటీ రాకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బాలుడి జాడకోసం జాలవేసిన ఫలితం దక్కలేదు. ఈకేసులో శిశువు జాడ కనిపించేనా? శిశువు తల్లిఒడిలో చేరుకుంటాడా? అంటూ ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఏది ఏమైన ఈ మిస్సింగ్ కేసు పోలీసులకే సవాల్ మారిందనే చెప్పాలి.
ఆ ఎంపీ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..?