YS Sharmila: ఇంట్లో వృద్దులు, వికలాంగులకు 3 వేలు పెన్షన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు ఆశీర్వదించండి… తెలంగాణలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ అనంతగిరి మండలం శాంతి నగర్ కు చేరుకున్న వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల, వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు.
ఈ సందర్బంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ..తెలంగాణాలో వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమని అన్నారు. వైఎస్సార్ హయాంలో తెలంగాణ సుభిక్షం గా ఉందని పేర్కొన్నారు. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్సార్ ఆదుకున్నారని గుర్తు చేసారు. వైఎస్సార్ ఏ పథకం చేసినా అద్భుతంగా చేసి చూపించారని షర్మిళ అన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసం చేశారని విమర్శించారు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
డబుల్ బెడ్ రూం అని మోసం.. మూడు ఎకరాల భూమి అని మోసం.. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారని మండిపడ్డారు. మీరు ఆశీర్వదించండి.. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకు వస్తా అని వైఎస్ షర్మిళ అన్నారు. ప్రతి పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇంట్లో ఎంత మంది వృద్దులు.. వికలాంగులు ఉన్నా అందరికీ 3 వేలు తక్కువ కాకుండా పెన్షన్ ఇస్తామని ఈసందర్భంగా షర్మిళ పేర్కొన్నారు. కాగా.. బొజగూడెం, తామరబండ పాలెం మీదుగా షర్మిల పాదయాత్ర అనంతరం.సాయంత్రం 4 గంటలకు కోదాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు వైఎస్ షర్మిల.
Bharat Bandh: భారత్ బంద్ ఎఫెక్ట్.. దిల్లీ సరిహద్దులో భారీ ట్రాఫిక్ జామ్
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!