Suryapet: సూర్యాపేట జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి అర్ధరాత్రి అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం వెలుగు చూసింది.
ఎమ్మెల్సీ తిరస్కరణ అంశంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. గవర్నర్ తమిళిసై తప్పుడు నిర్ణయం తీసుకుని సెల్ఫ్ గోల్ చేసుకున్నారు.. ఆమె గవర్నర్ అయ్యే సమయానికి తమిళనాడు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు అంటూ ఆయన మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడు అని విమర్శలు గుప్పించాడు.
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.. 105వ రోజు సూర్యపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని మోతే నుంచి ప్రారంభమైంది. హుసేనాబాద్, మామిళ్ళగూడెం వరకు ఇవాళ పాదయాత్ర కొనసాగనుంది. మామిళ్ళగూడెం వద్ద భట్టి విక్రమార్క లంచ్ బ్రేక్ తీసుకోనున్నాడు. సాయంత్రానికి ఖమ్మం జిల్లాలోకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించనుంది.
తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం ఒక టీజేఎస్ తోనే సాధ్యం అని కోదండరాం అన్నారు. తెలంగాణ శక్తులు ఉద్యమకారులు ఏకమై తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విషయంపై నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సన్నాహక సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డి అధ్యక్షత వహించారు.
సూర్యాపేట జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనుగోలు చేసిన రైస్ మిల్లర్లు.. ఆ తర్వాత వాటిని మిల్లులకు తీసుకెళ్లడం లేదు.. లారీల కొరత వల్లే ఈ సమస్య తలెత్తింది. దీంతో తమ పంటను అమ్ముకున్నా.. కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంచే పరిస్థితి నెలకొందని రైతులు బాధపడుతున్నారు.
Fire In Bus : సూర్యాపేట జిల్లాలోని దురాజ్ పల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. చివ్వెంల మండలం గంపుల గ్రామ శివారులో ఏపీకి చెందిన రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.