Suryapet: తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామీణ రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. సాధారణంగా గ్రామస్థాయి పదవుల కోసం స్థానికులు, వ్యాపారులు, రైతులు పోటీకి దిగడం చూస్తుంటాము. అయితే ఈసారి సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో చోటుచేసుకున్న పరిణామం అందరి దృష్టినీ ఆకర్షించింది. సర్వీస్ మిగిలి ఉండగానే సబ్‌ఇన్‌స్పెక్టర్ పులి వెంకటేశ్వర్లు ఉద్యోగాన్ని వదిలి సర్పంచ్ పదవికే నేరుగా పోటీ చేసేందుకు సిద్ధమవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
కూతురు పుడితే మా ఇంట్లో మహాలక్ష్మీ పుట్టిందని మురిసిపోయే తండ్రులు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే తండ్రి మాత్రం కూతురు పాలిట యముడిలా మారాడు. కూతురిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి కాలయముడయ్యాడు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని కాళ్లు పట్టుకుని నేలకేసి కొట్టి ప్రాణాలు తీశాడు. 12 నెలల కూతురుని కడతేర్చాడు తండ్రి. ఈ హృదయ విదారకమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో రాత్రి వేళ భార్యతో గొడవకు దిగాడు…
తేరగా డబ్బులు సంపాదించే వారు ఓ వైపు.. దురాశతో సంపాదిద్దామనుకునే వారు మరోవైపు.. వీరిద్దరి మధ్య బంధం ఫెవికాల్ కంటే గట్టిగానే ఏర్పడుతుంది. కానీ చివరకు అందులో నుంచి మోసం వెలుగులోకి వస్తుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంలలో సరిగ్గా ఇలాగే జరిగింది. బంగారు నాణేల పేరుతో ఓ వ్యాపారిని కేటుగాళ్లు బురిడీ కొట్టించారు. 20 లక్షల రూపాయలు కొట్టేశారు. చివరికి పోలీసులకు చిక్కారు. చివ్వెంల మండలం తుమ్మలపెంపహాడ్‌కు చెందిన పసుపుల గణేష్, ఓర్సు చంటి, మద్దంగుల వెంకన్న,…
సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అందిన సమాచారం ప్రకారం, ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న కృష్ణంరాజు, ఐదో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు.
Suryapet: సూర్యాపేట జిల్లా కేంద్రంలో నకిలీ గుండె వైద్యుడు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. శరత్ కార్డియాక్ కేర్ సెంటర్‌పై వచ్చిన ఫిర్యాదును ఆధారంగా తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రి అనుమతులు కార్డియాక్ డాక్టర్ పేరుతో తీసుకున్నప్పటికీ, వైద్య సేవలు మాత్రం కేవలం ఎంబిబిఎస్ అర్హత కలిగిన డాక్టర్ నిర్వహిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. గుండె సంబంధిత వైద్య సేవల పర్యవేక్షణలో అనుభవం లేకపోయిన డాక్టర్, గుండె సంబంధిత…
ఏ యూట్యూబర్లను అడ్డం పెట్టుకుని సీఎం అయ్యారో.. అదే యూట్యూబర్లపై కేసులు పెడుతున్నారు.. బీఆర్ఎస్ నేతల్ని సోషల్ మీడియాలో ఎంతగా తిట్టారో ప్రజలకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అలాగే, రేవంత్ రెడ్డి జాక్ పాట్ సీఎం అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
Farmers Protest: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగారు రైతులు. కాలువ ద్వారా సరిపడా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. డిమాండ్ కు సరిపడ సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని.. రైతులు సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మోతే, చివ్వెంల, నడిగూడెం.. మండలాలకు చెందిన రైతులు భారీ ఎత్తున తరలిరావడంతో సీఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.. యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమని ఎడ్యుకేషన్ అధికారులు ముందే చెప్పి ఉంటే పంట…
Gurukul Students Missing : సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట సమీపంలోని నెమలిపురి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఆరుగురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. విద్యా సంవత్సరం ముగింపు సందర్భంగా గురుకులంలో ఉపాధ్యాయులు వీడ్కోలు పార్టీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మద్యం సేవించి పార్టీకి హాజరయ్యారు. వారి ప్రవర్తనతో తోటి విద్యార్థులతో గొడవ జరిగింది. ఈ విషయాన్ని ఉపాధ్యాయులు గమనించి వారిని మందలించారు. ఉపాధ్యాయుల మందలింపుతో…
‘కొత్తగా మా ప్రయాణం’ చిత్రంలో హీరోగా నటించిన ఈశ్వర్, నైనా సర్వర్ జంటగా నటించిన సినిమా ‘సూర్యాపేట్ జంక్షన్’. ఈ చిత్రాన్ని యోగాలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ నిర్మించింది. రాజేష్ నాదెండ్ల దర్శకత్వం వహించారు. ఈశ్వర్, నైనా సర్వర్, అభిమన్యు సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
Suryapet: సూర్యాపేట జిల్లాలో జరిగిన పరువు హత్య కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. నాయనమ్మ కళ్ళలో ఆనందం కోసం చెల్లెలు భర్తను మనవళ్లు చంపేశారు.