Farmers Protest: ఎస్సారెస్పీ కాల్వ ద్వారా సాగునీటిని అందించాలని ఆందోళనకు దిగారు రైతులు. కాలువ ద్వారా సరిపడా సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని.. డిమాండ్ కు సరిపడ సాగునీటిని అందించి రైతులను ఆదుకోవాలని.. రైతులు సూర్యాపేట జిల్లా ఇరిగేషన్ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. మోతే, చివ్వెంల, నడిగూడెం.. మండలాలకు చెందిన రైతులు భారీ ఎత్తున తరలిరావడంతో సీఈ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.. యాసంగి పంటకు సాగునీరు ఇవ్వలేమని ఎడ్యుకేషన్ అధికారులు ముందే చెప్పి ఉంటే పంట సాగు చేసే వాళ్ళము కాదని రైతులు వాపోయారు. ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యాన్ని రైతులు ఎండగట్టారు. ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయలు రైతులు నష్టపోయారని రైతులు మండిపడుతున్నారు.
Student Kidnapped: కాకినాడలో బాలుడి కిడ్నాప్.. గాలిస్తున్న పోలీసులు!