POCSO : సూర్యాపేట జిల్లాలో సంచలనం రేపే ఘటన వెలుగులోకి వచ్చింది. నడిగూడెం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణంరాజుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అందిన సమాచారం ప్రకారం, ఇప్పటికే నాలుగు వివాహాలు చేసుకున్న కృష్ణంరాజు, ఐదో పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. ఇంతవరకు జరిగిన వివాహాలపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుండగా, ఈసారి అతను మైనర్ బాలికను వివాహం చేసుకున్నట్టు ఆరోపణలు వెలువడ్డాయి.
Ducati DesertX Rally: డుకాటి డెజర్ట్‌ఎక్స్ ర్యాలీ కొనుగోలుపై రూ. 1.5 లక్షల బెనిఫిట్స్..
కానిస్టేబుల్ కృష్ణంరాజు ముగ్గురు యువతులతో పాటు ఒక మైనర్ బాలికను కూడా వివాహం చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం బయటపడటంతో స్థానికంగా తీవ్ర చర్చ జరుగుతోంది. వివరాలు వెలుగులోకి రాగానే నడిగూడెం పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. సంబంధిత విభాగాలు ఈ కేసులో మరింత లోతైన విచారణ చేపట్టనున్నాయి. ఒకవైపు చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటివి చేయడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మైనర్ బాలికను వివాహం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
KTR : ఓపెన్ ఏఐ హైదరాబాద్‌లో ఆఫీస్ పెడుతుందా..? కేటీఆర్ ఇచ్చిన ఆహ్వానం