వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది.
6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
Adipurush: ప్రభాస్, సైఫ్ అలీఖాన్, కృతి సనన్ జంటగా నటించిన ఆదిపురుష్ చిత్రానికి సుప్రీం కోర్టు నుంచి శుభవార్త అందింది. జూలై 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్మాత, దర్శకుడు, డైలాగ్ రైటర్ను కోర్టు ఆదేశించిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని దేశంలోనే అతిపెద్ద న్యాయస్థానం స్టే విధించింది.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వేసిన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Supreme Court: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ కావడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వీడియో చాలా ఆందోళన కలిగించే విధంగా ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
PM Modi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు మణిపూర్లో జరిగిన దారుణ ఘటనపై ప్రధాని మోడీ స్పందించారు. ఇది 140కోట్ల మంది భారతీయులు సిగ్గుతో తలదించుకోవాల్సిన సంఘటనగా అభివర్ణించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభ్యర్థన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకారం తెలిపింది. కేసును విచారించేందుకు ఈ నెల 21న లిస్ట్ చేసింది.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో మొత్తం 11 మంది దోషులకు గత సంవత్సరం గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై బానో నిందితుల విడుదలను సవాలు చేస్తూ దాఖలు చేసిన వరుస పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణను ఆగస్టు 7న తుది వాదనలు వింటామని తెలిపింది.