Supreme Court: ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ రమ్మీపై నిషేధం వద్దన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.. ఆన్‌లైన్ రమ్మీ నిషేధం వద్దన్న ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే, ఆన్‌లైన్ రమ్మీ గేమా ? లేక అదృష్టమా..? అనే అంశం నిర్ధారించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది హైకోర్టు.. దీనిపై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను మధ్యంతర ఉత్తర్వులుగానే పరిగణించాలని పేర్కొంది.. కమిటీ నివేదిక అందిన తర్వాత అన్ని విషయాలను పరిశీలించాలని ఏపీ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు దీనిపై ప్రభావం చూపొద్దని ఆదేశించింది.. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని సూచించింది సుప్రీంకోర్టు.. ఈ అంశంపై హైకోర్టు తుది తీర్పు మూడు వారాల వరకు అమల్లోకి తీసుకురాకూడదని ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు.
Read Also: Heart Attack: విషాదం.. సినిమా చూసేందుకు వెళ్తుండగా గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి