ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం నేరాలకు పాల్పడినందుకు వీరిద్దరూ ఆగస్టు 2018 నుంచి జైలులో ఉన్నారు.
Manipur Viral Video: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుపై ఈరోజు (జూలై 28) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది.
వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో జులై 26 వరకు ఎలాంటి సర్వే నిర్వహించవద్దని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. పరిష్కారాల కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని ముస్లిం పిటిషనర్లను ఆదేశించింది.
6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.