హర్యానాలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో ఢిల్లీలో అలర్ట్ అయ్యారు. హర్యానాలో మాదిరిగా ఢిల్లీలో అల్లర్లు జరగకుండా ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకొనేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది.
ఎల్గార్ పరిషత్ కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు కార్యకర్తలు వెర్నాన్ గోన్సాల్వేస్, అరుణ్ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం నేరాలకు పాల్పడినందుకు వీరిద్దరూ ఆగస్టు 2018 నుంచి జైలులో ఉన్నారు.
Manipur Viral Video: మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుపై ఈరోజు (జూలై 28) సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సుప్రీంకోర్టు సమాధానాలు కోరింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించాలని కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై సుప్రీంకోర్టు జులై 27న విచారణ చేపట్టనుంది.