Supreme Court: ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు బెయిల్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను సుప్రీంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలు చేసింది. ఈ కేసులో విచారణ చేసిన ఏపీ ప్రభుత్వ పిటిషన్ ను కొట్టి వేసింది. చంద్రబాబు విచారణకు సహకరించపోతే బెయిల్ రద్దు పిటిషన్ వేయండి.. ఈ దశలో ఈ కేసులో జోక్యం చేసుకోలేమని కేసు విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ కన్నా, జస్టిస్ దిపాంకర దత్తల సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. డిపరేన్స్ (Difrense) ఒపీనియన్ తీర్పుతో ఈ కేసుకు సంబందం ఉందా అని సుప్రీం కోర్టు జడ్జి అడిగారు. ఐఆర్ఆర్ కేసులో జనవరి 10న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరీ చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది. దర్యాప్తు సమయంలో ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది.