Delhi: సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ప్రారంభించనున్న మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: దేశ సర్వోన్నత న్యాయస్థానం 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. 1950 జనవరి 28న సుప్రీంకోర్టు ప్రారంభమైంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ న్యాయస్థాన వజ్రోత్సవాలను ప్రారంభించనున్నారు. సుప్రీం కోర్టు ఆవరణలో ఈ డైమండ్ జూబ్లీ వేడుకలు ప్రారంభంకానున్నాయి. అనంతరం డైమండ్ జూబ్లీ వేడుకలనుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Read Also: Himanta Biswa Sarma : యాత్రలో రాహుల్ బాడీ డబుల్ ను వాడుతున్నారు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్య
Also Read
- ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
- PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
- OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
- Trump-Jinping: ఇరాన్‌కు సాయపడడం భావ్యం కాదు.. జిన్‌పింగ్‌కు ట్రంప్ హితవు
ఇక దేశ పౌరులకు ఉచితంగా ఎలక్ట్రానిక్ ఫార్మాట్‌లో డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు, సుప్రీంకోర్టు తీర్పులు అందుబాటులోకి రానున్నాయి. డిజిటల్ సుప్రీం కోర్టు నివేదికలు (డీజీ ఎస్‌సీఆర్), డిజిటల్ కోర్టులు 2.0, సుప్రీంకోర్టు కొత్త వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం 1950 నుంచి ఉన్న సుప్రీం కోర్టు నివేదికలు, 519 వాల్యూమ్స్ నివేదికలు, 36,308 కేసుల తీర్పులు డిజిటల్ ఫార్మాట్‌లో ప్రజలకు అందుబాటులోకి వస్తాయి.
Read Also: Budget 2024 : ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్.. 10 లక్షల మందికి ఉద్యోగాలు
సుప్రీం బ్యాక్‌గ్రౌండ్ ఇదే..
1950 జనవరి 28 ఉదయం 9.45 గంటలకు న్యాయమూర్తులు తొలిసారి సమావేశమవడంతోనే సుప్రీంకోర్టు అధికారికంగా ప్రారంభించినట్లుగా గుర్తించారు. ప్రస్తుతం ఉన్నకోర్టు అందుబాటులోకి రాకముందు పాత పార్లమెంటు భవనంలోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్‌లో న్యాయస్థానం కొనసాగింది. తొలిరోజుల్లో ధర్మాసనం ఏడాదికి 28 రోజులు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు మాత్రమే సమావేశమయైంది. అనంతరం ఏడాదికి 190 రోజులు పని చేసే స్థాయికి చేరుకుంది.
ఇక ప్రారంభంలో జడ్జిల సంఖ్య 8 ఉంది ఉండగా ఇప్పుడా సంఖ్య 34కు చేరింది. ప్రస్తుతం ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌లో ఉన్న సుప్రీంకోర్టు భవనం 17 ఎకరాల త్రికోణాకార స్థలంలో నిర్మితమైంది. 1954 అక్టోబరు 29న అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరో నాలుగేళ్లకు 1958 ఆగస్టు 4న ఆయనే దీన్ని ప్రారంభిస్తూ న్యాయ దేవాలయంగా అభివర్ణించారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!