దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
Read Also: Jayaprada: కోర్టులో లొంగిపోయిన జయప్రద
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేసేందుకు అధికార పార్టీకి కోర్టు సుధీర్ఘ గడువు ఇచ్చింది. జూన్ 15లోగా పార్టీ తమ పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని పేర్కొంది. పార్టీ కార్యాలయాన్ని వేరే చోటికి మార్చాలని కోర్టు పేర్కొంది. ప్రస్తుత ప్రదేశంలో కొనసాగే హక్కు ఆప్‌కు లేదని పేర్కొంది. పార్టీ కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ స్థలం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతినించింది. నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని కోర్టు ఆదేశించింది.
Read Also: Kishan Reddy: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ దుర్వినియోగం కాకుండా చూడాలి
ఎవరూ కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోలేరని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘ఒక రాజకీయ పార్టీ అక్కడ ఎలా కార్యకలాపాలు నిర్వహిస్తుంది..? అక్రమ కట్టడాలన్నింటిని తొలగిస్తాం. ప్రజలకు ఉపయోగపడే భూమిని హైకోర్టుకు తిరిగి స్వాధీనం చేయాలి. అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని నిర్ధారించేందుకు తదుపరి వాయిదాలోగా ఢిల్లీ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సమావేశం కావాలి’ అని ఆదేశించింది. ఈ మేరకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్‌లు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది.