Coast Guard: కోస్ట్ గార్డ్‌లో శాశ్వత కమిషన్‌పై కేంద్రానికి సుప్రీం చురకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
భారత తీరగస్తీ దళంలో మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా చర్యలు తీసుకోకుంటే తామే ఒక అడుగు ముందుకువేయాల్సి వస్తుందని హెచ్చరించింది.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
అర్హులైన మహిళా అధికారులతో శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఇండియన్ కోస్ట్ గార్డుకు చెందిన ఓ అధికారిణి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని న్యాయస్థానం విచారించింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి వాదనలు వినిపించారు.
ఆర్మీ, నేవీతో పోలిస్తే కోస్ట్ గార్డులో పనితీరు కొంచెం భిన్నంగా ఉంటుందని ధర్మాసనం దృష్టికి అటార్నీ జనరల్ తీసుకెళ్లారు. మహిళలను మినహాయించేందుకు అవి కారణాలు కాదని పేర్కొంటూ ఏజీ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మహిళలను వేరుగా చూడలేమని.. ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తామే జోక్యం చేసుకుంటామని స్పష్టంచేసింది. అందుకే.. ఈ అంశాన్ని పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ స్పందనను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని పేర్కొంటూ తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి (మార్చి 1) వాయిదా వేసింది.
ఇదిలా ఉంటే వారం క్రితం ఇదే పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. మహిళలను సముచితంగా పరిగణించే విధానాన్ని రూపొందించాల్సిందేనని కేంద్రానికి స్పష్టంచేసింది. త్రివిధ దళాల్లో మహిళలకు శాశ్వత కమిషన్ల ఏర్పాటుపై సుప్రీం తీర్పులిచ్చినా ఇంకా పూర్వకాల ఆలోచనలతోనే ఉన్నారా? అని నిలదీసింది. నౌకాదళంలో శాశ్వత కమిషన్ ఉన్నప్పుడు కోస్ట్‌గార్డ్ అలా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించింది. స్త్రీ పురుష సమానత్వం ఉన్న విధానాన్ని రూపొందించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రభుత్వం స్వచ్ఛందంగా అవసరమైన చర్యలు తీసుకోకపోతే.. పేర్కొన్న రక్షణ సేవలో లింగ సమానత్వం ఉండేలా కోర్టు జోక్యం చేసుకుంటుందని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ హెచ్చరించారు.
తాజావార్తలు
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!