Patanjali: ప్రముఖ యోగా గురు రామ్ దేవ్ బాబాకు చెందిన ‘పతంజలి’ తప్పుడు ప్రకటనలో కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఆయుర్వేద్ ‘తప్పుదోవ పట్టించే, తప్పుడు ప్రకటనల’ కేసులో కేంద్రం తీరుపై అత్యున్నత న్యాయస్థానం మండిపడింది. ప్రభుత్వం కళ్లు మూసుకుని కూర్చుంటుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ప్రకటనల ద్వారా దేశం మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. ఇది చాలా దురదృష్టకరమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
Supreme Court : యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఆయుర్వేదానికి సంబంధించిన సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కంపెనీ తప్పుదారి పట్టించే ప్రకటనకు సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో (Indian Coast Guard) శాశ్వత కమిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. అర్హులైన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయకుంటే న్యాయస్థానమే అందులో జోక్యం చేసుకుంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మహిళా కోస్ట్‌గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి అల్టిమేటం ఇస్తూ.. ‘మహిళలను వదిలిపెట్టలేం అని, మీరు చేయకుంటే మేం చేస్తాం’ అని సుప్రీం కోర్టు ఈరోజు పేర్కొంది.
బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బీజేపీ ఐటీ సెల్ గురించి యూట్యూబర్ ధృవ్ రాఠి షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేయడం తన తప్పు అని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అంగీకరించారు.
ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ ఇవాళ ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ పథకాన్ని ఒక కుంభకోణంగా ఆయన అభివర్ణించారు.
ఒక పరువు నష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో నేడు (సోమవారం) విచారణ జరుగనుంది.
కోస్ట్ గార్డ్ కు చెందిన మహిళా అధికారి పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు (సోమవారం) విచారించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్‌కు అర్హులైన మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్‌లో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.