MLC Kavitha Husband Anil: ఎమ్మెల్సీ కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నెల 19న కవితపై కేసు విచారణ జరగనుందని, ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది గతంలో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. కాగా, ఆదివారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను విచారించారు. విచారణలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చినట్లు సమాచారం. విచారణను అధికారులు వీడియో రికార్డు చేసినట్లు సమాచారం.
Read also: Kolkata: కుప్పకూలిన 5 అంతస్తుల భవనం.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
విచారణ అనంతరం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఆమె భర్త అనిల్, న్యాయవాది మోహిత్‌రావు కవితను కలిశారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ.. తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఆరోపణలుగానే మిగిలిపోతాయని, కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పినట్లు సమాచారం. కాగా, ఎమ్మెల్సీ కవిత సమీప బంధువులు, ఆమె వ్యక్తిగత సిబ్బంది కొందరు సోమవారం ఆమెను కలిసే అవకాశం ఉంది. మరోవైపు కవిత భర్త అనిల్‌కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలసిందే. అనిల్ తోపాటు.. కవిత పీఆర్వో రాజేష్, ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులిచ్చింది. ఇవాళ హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. మరి అనిల్ హాజరు అవుతారా? అనేది దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
Read also: Vladimir Putin : రష్యాలో ఏకపక్ష విజయం.. చైనా, దేశద్రోహులపై కీలక వ్యాఖ్యలు చేసిన పుతిన్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి 23 వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉంటారని రోస్ అవెన్యూ కోర్టు శనివారం తెలిపింది. ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ బీఆర్‌ఎస్ నాయకుడిని రిమాండ్‌కు తరలించాలని కోరుతూ ఈడీ చేసిన దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేశారు. కవితను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని విచారణ సంస్థ కోరింది. అయితే, న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు మాత్రమే రిమాండ్ విధించారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె సీఎం అయితే ఏం చేస్తారని ప్రశ్నించారు. తాను ముఖ్యమంత్రి అయితే మద్యాన్ని నిషేధిస్తానని, కొంచెం కష్టమైనా తప్పకుండా చేస్తానని అన్నారు.
Gold Price Today: తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?