ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు సమయం పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ (SBI) వేసిన పిటిషన్‌పై మార్చి 11న సుప్రీంకోర్టు (Supreme court) విచారణ చేపట్టనుంది.
ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఎన్నికల కమిషన్‌కు ఇవ్వడానికి జూన్ 30 వరకు సమయం కావాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును కోరింది. ఫిబ్రవరి 15న ఎలక్టోరల్ బాండ్ స్కీమ్‌ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంలో, మార్చి 6లోగా ఎన్నికల కమిషన్‌కు జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని అందించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.
Supreme Court Angry on Udhayanidhi Stalin Comments: సనాతన ధర్మం గురించి సినీ హీరో, డీఎంకే నేత – తమిళనాడు మంత్రి, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ఏడాది సెప్టెంబర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ‘‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి’’ అని అన్నారు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి వ్యతిరేకమని పేర్కొన్న స్టాలిన్ కామెంట్ల మీద దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ…
దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మొదట పార్టీ నేతలు, ఇప్పుడు పార్టీ కార్యాలయంపైనే దాడి జరిగింది. ఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. జూన్ 15లోగా తమ కార్యాలయాన్ని ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కోసం కేటాయించిన స్థలంలోనే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాన్ని నిర్మించినట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ఖాళీ చేయాలని తెలిపింది.
Supreme Court : ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభల్లో ఓటు వేయడానికి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సందర్భంలో వారికి విచారణ నుంచి మినహాయింపు ఉండదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి.. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. విచారణను వచ్చే నెల 13వ తేదీన జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం స్పష్టం చేసింది. కి వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. కాగా.. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది.. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని…
Baba Ramdev : బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలికి సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. ఆ తర్వాత బుధవారం ఉదయం పతంజలి ఫుడ్స్ షేర్లలో దాదాపు 4 శాతం క్షీణత కనిపించింది.