Electoral Bonds: ఎలక్టోరల్ బాండ్స్‌కి సంబంధించి తాజాగా ఈసీ ఈ రోజు కొత్త సమాచారాన్ని విడుదల చేసింది. 2018లో ప్రవేశపెట్టిన ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయంలో అగ్రకొనుగోలుదారుగా ఉన్న ఫ్యూచర్ గేమింగ్, హోటల్ సర్వీసెస్ ద్వారా తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి రూ. 509 కోట్ల విరాళం అందినట్లు ఎన్నికల సంఘం డేటా ఆదివారం వెల్లడించింది. ఈ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలులో అగ్రస్థానంలో ఈ కంపెనీ ఉంది. ఒకే కంపెనీ నుంచి ఒకే పార్టీకి ఇంత మొత్తంలో నిధులు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Read Also: Manoj Sharma: ‘‘12th ఫెయిల్’’ రియల్ హీరోకి IGగా ప్రమోషన్..
ఒడిశాలో అధికార పార్టీ బీజేడీకి రూ. 944.5 కోట్లు, డీఎంకేకి రూ. 656.5 కోట్లు, వైస్సార్సీపీకి రూ. 442.8 కోట్ల నిధులు అందాయి. జేడీఎస్‌కి రూ. 89.5 కోట్ల విలువైన బాండ్లను అందుకుంది. లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్‌కి చెందిన ఫ్యూచర్ గేమింగ్ రూ. 1368 కోట్లతో ఎలక్టోరల్ బాండ్లను అత్యధికంగా కొనుగోలు చేసింది. ఇందులో 37 శాతం డీఎంకే పార్టీకి నిధులు వెళ్లాయి. దాతల గుర్తింపు వెల్లడించిన కొద్ది పార్టీల్లో డీఎంకే ఉంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఆప్ వంటి ప్రధాన పార్టీలు ఎన్నికల కమిషన్‌కి వివరాలను వెల్లడించలేదు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం వీటిని బహిరంగపరచాల్సి ఉంది. ఈ బాండ్ల ద్వారా టీడీపీకి రూ. 181.35 కోట్లు, శివసేనకు రూ. 60.4 కోట్లు, ఆర్జేడీకి రూ. 56 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ. 14.05 కోట్లు, అకాలీదళ్‌కి రూ. 7.26 కోట్లు, ఏఐడీఎంకేకీ రూ. 6.05 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కి రూ. 50 లక్షలు అందాయి. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా నిధులు స్వీకరించబోమని సీపీఎం ప్రకటించింది.