Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్.. సుప్రీంకోర్టులో విచారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Skill Development Case: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కే సులో బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ విచారణ జరుగుతుంది.. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు జస్టిస్ బేలాఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే.. దీంతో.. తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా వేసింది..
Read Also: Purandeswari: ఢిల్లీకి పురంధేశ్వరి.. ఆ తర్వాతే అభ్యర్థుల ఫైనల్..!
Also Read
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
- రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
చంద్రబాబు కుటుంబం ఒక డైరీ పెట్టి.. దానిలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెపుతోందని, తాము అధికారంలోకి వస్తే.. అందరిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తోందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ. ఈ పిటిషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటని ప్రభుత్వ న్యాయవాదులను జస్టిస్ బేలా త్రివేది ప్రశ్నించారు. బెయిల్ రద్దు చేయాలని కోరుతున్నట్లు ముకుల్‌రోహత్గి చెప్పారు.. స్కిల్ కేసులో బెయిల్ మంజూరు తర్వాత.. చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయని, నిందితుడి కుటుంబ సభ్యులు అధికారులను, దర్యాప్తు సంస్థను బెదిరిస్తున్నారన్న ముకుల్ రోహత్గి వాదించారు. వెంటనే బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలు ఉన్నాయని, వెంటనే విచారణ చేపట్టాలని ముకుల్ రోహత్గి కోరారు.
Read Also: Puspa 2: యాంగటిలో పుష్ప – 2 షూటింగ్..!
అయితే, ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి తాము సమాధానం ఇస్తామన్న చంద్రబాబు న్యాయవాదులు అంటున్నారు. దీంతో, రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం. ఇక, మూడు వారాల తరువాత తదుపరి విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించిన ధర్మాసనం. మరోవైపు.. స్కిల్ కేసులో హైకోర్టు చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై నేడు మరోసారి విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం ముందు ఈ విచారణ జరగనుంది.. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయ్యిందన్న అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదని ప్రధానంగా పిటిషన్‌లో పేర్కొంది సీఐడీ.. మరి ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరగబోతోంది? అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!