ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. ఈ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేయడం స్వేచ్ఛాయుతమైన ఎన్నికలు, సమాఖ్య వాదంపై ఆధారపడిన ప్రజాస్వామ్య సూత్రాలపై దాడి అని కేజ్రీవాల్ గతంలో సుప్రీంకోర్టుకు తెలిపారు.
Read Also: Jammu : నదిలో పడ్డ కారు.. నలుగురు మృతి… ముగ్గురు సేఫ్
ఇక, ఈ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈడీ కౌంటర్ అఫిడవిట్‌పై కేజ్రీవాల్ స్పందిస్తూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడల్ ప్రవర్తనా నియమావళిని విధించడంతో తనను అరెస్టు చేసిన విధానం ఏకపక్షంగా ఉందని చెప్పారు. తనను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని అతడు చెప్పుకొచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీని, దాని నాయకులను అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాని విస్తృత అధికారాలను దుర్వినియోగం చేసింది అని ఆరోపించారు. కాగా, సిట్టింగ్ ముఖ్యమంత్రి, ఇండియా కూటమిలోని ఒకపార్టీకి జాతీయ కన్వీనర్‌గా ఉన్న తనను ఈడీ తప్పుగా ఎంపిక చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అతని అరెస్టు స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు చాలా అవసరం అని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు.