PM Modi: ఈవీఎం-వీవీప్యాట్లపై దాఖలైన పిటిషన్లను ఈ రోజు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటర్ వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లతో క్రాస్ చేక్ చేయాలని కోరుతూ పలువురు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతున్న వేళ ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను అక్కడే ఉంచే వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో వందకు వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లపై ఇవాళ (శుక్రవారం) సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించనుంది.
Supreme Court: ఎన్నికలను నియంత్రించే అధికారం తమది కాదని సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన అధికార సంస్థ ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమని సుప్రీం పేర్కొంది.
చైల్డ్ కేర్ లీవ్‌పై సుప్రీం కోర్టు వికలాంగ పిల్లల సంరక్షణకు సెలవు ఇవ్వకపోవడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన అంశంగా పరిగణించింది. వికలాంగ బిడ్డను చూసుకునే తల్లికి శిశు సంరక్షణ సెలవును నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళల సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించే రాష్ట్ర రాజ్యాంగ విధిని ఉల్లంఘించడమేనని సోమవారం పేర్కొంది.