Supreme Court: కేసీఆర్ పదేళ్ల పాలనలో విద్యుత్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ చైర్మన్ ను తొలగించి కొత్త వ్యక్తిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ తీర్పును ప్రకటించింది. విచారణ అధికారిని మార్చవచ్చునని స్పష్టం చేశారు. అయితే దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ మాట్లాడారు. ధర్మాసనం ప్రకటపై అడ్వకేట్ జనరల్ తో ముఖ్యమంత్రి రేవంత్ చర్చిస్తున్నారు. సీఎం కు అడ్వకేట్ జనరల్.. సీనియర్ జడ్జిల పేర్లు సూచించారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త జడ్జి పేరును ప్రకటించనున్నారు.
Read also: KTR Tweet : మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో..
విద్యుత్ విచారణ కమిషన్‌ను రద్దు చేయాలన్న కేసీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కేసీఆర్ తరఫున న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. న్యాయ కమిషన్ నియామకం చట్ట ప్రకారం జరగలేదని వాదించారు. మాజీ సీఎం పిటిషన్‌ను పూర్తిగా విచారించకముందే హైకోర్టు కొట్టి వేసిందన్నారు. వారు సమాధానం చెప్పకుండానే పిటిషన్‌ను కొట్టివేశారు. న్యాయ కమిషన్ చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తికాకముందే జస్టిస్ నర్సింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ తప్పు చేశారని చెప్పారని ఆయన కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తికాకముందే కేసీఆర్‌ను దోషిగా తేలుస్తున్నారనే వాదనలు ముకుల్ రోహత్గీ వినిపించారు.
Read also: Amartya Sen: అప్పట్లో రాహుల్ గాంధీకి రాజకీయాలు నచ్చేవి కాదు.. నెక్ట్స్ ప్రధాని అతడే..?
అయితే ప్రెస్‌మీట్‌లో విచారణ స్టేటస్‌ను మాత్రమే ప్రస్తావించారని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో విద్యుత్ సమస్యలు ఉన్నందున ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నామని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. యూనిట్‌కు 3 రూపాయల 90 పైసల చొప్పున విద్యుత్ కొనుగోలు చేశామన్నారు. అయితే బహిరంగ బిడ్డింగ్‌కు బదులు చర్చల ప్రకారం విద్యుత్‌ను ఎందుకు కొనుగోలు చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించగా, అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండానే విద్యుత్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉందని కోర్టుకు తెలిపింది. కేసీఆర్‌తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు నోటీసులు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కారణంగా జూన్ 30 వరకు సమాధానం చెప్పలేమని కేసీఆర్ చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులన్నీ సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తుండగా… భద్రాద్రిని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించడం.. దీంతో ప్రభుత్వ ఖజానాకు ఖర్చు పెరిగింది.
Cobra Coiled Around Shivling: శ్రీశైలంలో శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము.. వీడియో వైరల్..